కరోనా వైరస్..ఉపాసన చెప్పిన సూచనలు, జాగ్రత్తలు

  • Published By: madhu ,Published On : March 4, 2020 / 02:26 AM IST
కరోనా వైరస్..ఉపాసన చెప్పిన సూచనలు, జాగ్రత్తలు

Updated On : March 4, 2020 / 2:26 AM IST

కరోనా వైరస్ విజృంభిస్తోంది. హైదరాబాద్‌లో కూడా కరోనా కేసు నమోదు కావడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. ఈ సందర్భంగా ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రభుత్వం కార్యచరణ సిద్ధం చేస్తోంది. ప్రముఖుల చేత ప్రచారం చేపట్టాలని నిర్ణయించింది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తనదైన శైలిలో స్పందించే..రామ్ చరణ్ సతీమణి..ఉపాసన కరోనా వైరస్‌పై తగిన జాగ్రత్తలు చెప్పారు.

ఈమె అపోలో సంస్థల ఉపాధ్యక్షురాలు అనే సంగతి తెలిసిందే. ఎలాంటి ఆందోళన చెందాల్సినవసరం లేదని, వైరస్ వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని తెలిపారు. ఈ మేరకు ఇన్ స్ట్రాగ్రామ్ వేదికగా పోస్టు చేశారు. సికింద్రబాద్ అపోలో ఆసుపత్రిలో కరోనా కేసును గుర్తించడం జరిగిందని, ఈ రోగిని గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ప్రభుత్వం పటిష్టమైన ఏర్పాట్లు, జాగ్రత్తలు చేపడుతోంది. ఎవరూ ఆందోళన చెందాల్సినవసరం లేదు అని తెలిపారు. 
సూచనలు..జాగ్రత్తలు : – 
* ఉడకబెట్టని మాంసం తినవద్దు
* వైరస్ గాలి ద్వారా వ్యాపించదు. అయినా సరే మాస్క్‌లు ధరించడం మంచిది. 
* వైరస్‌కు యాంటీ బయోటిక్స్ లేవు. వైద్యులు చెప్పకుండా ఎలాంటి మందులు వేసుకోవద్దు. 

* జ్వరం, తలనొప్పి, ఊపిరితిత్తుల సమస్యలు, దగ్గు, ఒళ్లునొప్పులు ఉంటే..వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. 
* బయట తిరగి వచ్చిన తర్వాత..శుభ్రంగా కడుక్కోవాలి. 
* దగ్గు, తముళ్లు వచ్చే వాళ్ల నుంచి కనీసం 3 అడుగుల దూరంలో ఉండండి. 
* వేడి ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఉండేందుకు ప్రయత్నించాలి. 
Read More : కరోనా భయం : రూ. 1.60 మాస్క్..రూ. 20 పైనే!

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

the @theapollohospitals Secunderabad detected a case of #corona virus cos of strong screening protocols, as per current government norms we are supposed to send the patient to Gandhi Hospital for treatment. The patient is stable & the apollo hospital Secunderabad staff that cared for him are in quarantine. Highest standards of infection control protocols have been adopted by our paramedics. The government is doing an amazing job & our hospitals in Hyderabad are braced to deal with the outbreak. Don’t be in panic mode, just be responsible citizens ? by 1. getting checked if u have symptoms 2. Follow the precautions below : The corona virus is transmitted through droplets from sick people and is NOT AIR BORNE. wash hands with soap/ sanitisers before eating & after being out in public Observe good personal hygiene Avoid close contact with people who are unwell or showing symptoms of illness, such as cough, runny nose etc. Avoid consumption of raw/undercooked meats . Maintain hygienic food practices Wear a mask if you have respiratory symptoms such as cough or runny nose Maintain a minimum 3 ft distance from a person who is sneezing or coughing Cough or sneeze into the INSIDE OF THE ELBOW , NOT HANDS Use disposable tissues to cover your cough & cold. Discard used tissues immediately into an appropriate waste bin & sanitise hands immediately Offer a surgical mask to person who is coughing or sneezing Keep a window open or let the air conditioner be on wipe surfaces (e.g. desks and tables) & objects (e.g. telephones, keyboards) with disinfectant regularly #covid19 #coronavirus

A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) on