Pooja Hegde : ఆవారా సినిమాకి సీక్వెల్ ప్రకటించిన దర్శకుడు లింగుసామి? బుట్టబొమ్మ హీరోయిన్?

తమిళ డైరెక్టర్ లింగుసామి తన దర్శకత్వంలో ఇటీవల రామ్ తో తెలుగు, తమిళ్ లో బైలింగ్వల్ సినిమాగా ది వారియర్ సినిమాని తీసుకొచ్చాడు. కానీ ఆ సినిమా ఘోర పరాజయం పాలైంది. దీంతో అప్పట్నుంచి ఇంకా ఏ సినిమాని ప్రకటించలేదు. ఇటీవల...........

Pooja Hegde : ఆవారా సినిమాకి సీక్వెల్ ప్రకటించిన దర్శకుడు లింగుసామి? బుట్టబొమ్మ హీరోయిన్?

director lingusamy wants to direct awara 2 movie and cast pooja hegde as female lead

Updated On : February 24, 2023 / 12:25 PM IST

Pooja Hegde :  తమిళ డైరెక్టర్ లింగుసామి తన దర్శకత్వంలో ఇటీవల రామ్ తో తెలుగు, తమిళ్ లో బైలింగ్వల్ సినిమాగా ది వారియర్ సినిమాని తీసుకొచ్చాడు. కానీ ఆ సినిమా ఘోర పరాజయం పాలైంది. దీంతో అప్పట్నుంచి ఇంకా ఏ సినిమాని ప్రకటించలేదు. ఇటీవల డబ్బుల విషయంలో కేసులు, కోర్టులు అంటూ కొన్ని రోజులు వార్తల్లో కూడా నిలిచారు. లింగుసామి తీసిన గత సినిమాలు పందెంకోడి 2, సికిందర్ కూడా ఆశించినంత విజయం సాధించలేదు. దీంతో ఇప్పుడు లింగు సామికి హిట్ కావాలి.

గతంలో లింగుసామి పందెంకోడి, ఆవారా లాంటి సూపర్ హిట్ సినిమాలు అందించాడు. దీంతో ఇప్పుడు ఆవారా సినిమాకు సీక్వెల్ తీయాలని అనుకుంటున్నాడు లింగుసామి. తమిళ్ లో కార్తీ, తమన్నా జంటగా లింగుసామి దర్శకత్వంలో ‘పయ్యా’గా తెరకెక్కిన సినిమా తెలుగులో ఆవారా గా రిలీజయింది. రెండు చోట్ల ఈ సినిమా మంచి విజయం సాధించింది. పలు అవార్డులని కూడా దక్కించుకుంది ఈ సినిమా. దీంతో ప్రస్తుతం హిట్స్ లేక అల్లాడుతున్న లింగుసామి ఆవారా సినిమాకు సీక్వెల్ తీద్దామని ఫిక్స్ అయి కథ కూడా సిద్ధం చేసుకున్నాడట.

Movies delaying : ఈ సినిమాలు ఉన్నట్టా? లేనట్టా? కన్ఫర్మేషన్ ఇమ్మంటున్న ఫ్యాన్స్..

ఆవారా 2 కథని ఇప్పటికే కార్తీ, సూర్యకు చెప్పినా వాళ్ళు నో చెప్పడంతో తమిళ్ హీరో ఆర్యకి చెప్పగా ఓకే చెప్పినట్టు సమాచారం. అలాగే హీరోయిన్ గా పూజా హెగ్డే ని తీసుకోవడానికి ట్రై చేస్తున్నాడట లింగుసామి. ఇప్పటికే పూజ హెగ్డే తమిళ్ లో రెండు సినిమాలు చేయగా రెండూ ఆశించినంత విజయం సాధించలేదు. మరి ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా ఉన్న పూజా ఈ సినిమా అసలు ఒప్పుకుంటుందా అని ఆలోచిస్తున్నారు. అసలు లింగుసామి అనుకున్నా ఆవారా 2 ఇప్పట్లో పట్టాలెక్కుతుందా అని తమిళ పరిశ్రమ అనుకుంటున్నారు. చూడాలి మరి లింగుసామి ఏం చేస్తాడో?