Jabardasth Punch Prasad : సీఎం జగన్‌కు, మంత్రి రోజాకు థాంక్యూ.. అనారోగ్యంతో బాధ పడుతున్న పంచ్ ప్రసాద్ వీడియో..

తన చికిత్సకు అవసరమైన డబ్బును CMRF ద్వారా మంజూరు చేసినందుకు జ‌బ‌ర్ద‌స్త్ కమెడియన్ పంచ్ ప్ర‌సాద్.. సీఎం జగన్‌కు, మంత్రి రోజాకు థాంక్యూ చెబుతూ ఒక యూట్యూబ్ వీడియోని రిలీజ్ చేశాడు.

Jabardasth Punch Prasad : సీఎం జగన్‌కు, మంత్రి రోజాకు థాంక్యూ.. అనారోగ్యంతో బాధ పడుతున్న పంచ్ ప్రసాద్ వీడియో..

Jabardasth Punch Prasad Thanks to YS Jagan Mohan Reddy Roja Selvamani

Updated On : June 12, 2023 / 9:27 PM IST

Jabardasth Punch Prasad : జ‌బ‌ర్ద‌స్త్ కమెడియన్ పంచ్ ప్ర‌సాద్ ఇటీవల తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్ లో జాయిన్ అయ్యిన సంగతి అందరికి తెలిసిందే. గత కొంత‌కాలంగా ప్రసాద్ కిడ్నీ సంబంధిత స‌మ‌స్య‌తో బాధ పడుతున్న ప్రసాద్.. రెగ్యుల‌ర్‌గా డ‌యాసిస్ చికిత్స చేయించుకుంటూ వస్తున్నాడు. కేవలం చికిత్సకు గానే చాలా ఖర్చు అవుతుండడంతో ప్రసాద్ భార్య.. ఒక యూట్యూబ్ వీడియో ద్వారా ప్రేక్షకులను సాయం కోరింది. అయితే ఇంతలో ప్రసాద్ కి మరికొంచెం సీరియస్ అవ్వడం, డాక్టర్లు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేష‌న్ చేయాల్సిందే అని చెప్పడం జరిగింది.

Prabhas – Raviteja : సంక్రాంతి బరిలో రెండు యాక్షన్ థ్రిల్లర్స్.. ప్రభాస్ అండ్ రవితేజల్లో ఎవరు గెలుస్తారు..?

ఆ ఆపరేషన్ భారీ ఖర్చుతో కూడుకున్న విషయం కావడంతో ప్రసాద్ కుటుంబం మరియు స్నేహితులు సహాయం కోసం ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే మ‌రో జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియెన్ నూక‌రాజు (Jabardasth Emmanuel) తన సోషల్ మీడియా ద్వారా ప్రసాద్ కి హెల్ప్ చేయాలంటూ నెటిజెన్స్ ని కోరుతూ బ్యాంకు వివరాలు ఉన్న ఒక ఫోటోని షేర్ చేశాడు. ఇక ఈ విషయాన్ని మంత్రి రోజా.. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మెహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) దృష్టికి తీసుకెళ్లారు. జగన్ కూడా సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా పంచ్‌ ప్రసాద్‌ కు సాయం చేయాలనీ అధికారులను ఆదేశించారు.

SS Rajamouli: పొలిటిక‌ల్‌గా రాజ‌మౌళి అభిమానించే లీడ‌ర్ ఎవ‌రో తెలుసా..?

ప్రసాద్ కి త్వరలోనే వైద్యులు ఆపరేషన్ చేయనున్నారు. అందుకు అయ్యే పూర్తి ఖర్చు జగన్ ప్రభుత్వం భరించనుండడంతో ప్రసాద్ థాంక్యూ చెబుతూ ఒక యూట్యూబ్ వీడియోని రిలీజ్ చేశాడు. గతంలో కూడా మంత్రి రోజా తనకి ఎంతో సహాయం చేసినట్లు, ఇప్పుడు తన ఆరోగ్య పరిస్థితిని జగన్ దృష్టికి తీసుకువెళ్లి మరోసారి సాయపడ్డారని చెప్పుకొచ్చాడు. తన చికిత్సకు అవసరమైన డబ్బును CMRF ద్వారా మంజూరు చేసినందుకు సీఎం జగన్‌కు, మంత్రి రోజాకు చాలా థాంక్యూ అని పేర్కొన్నాడు. ఇక ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండడంతో నెటిజెన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.