Kangana Ranaut : రాజమౌళిని ఏమన్నా అంటే ఊరుకునేది లేదు.. కంగనా రనౌత్ వార్నింగ్!

ఇటీవల రాజమౌళి ఒక నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మత వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడంటూ కొంతమంది మతవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ రంగంలోకి దిగింది. రాజమౌళి చేసిన తప్పేంటో చెప్పాలి అంటూ గట్టిగా ప్రశ్నించింది.

Kangana Ranaut : రాజమౌళిని ఏమన్నా అంటే ఊరుకునేది లేదు.. కంగనా రనౌత్ వార్నింగ్!

Kangana Ranaut rajamouli

Updated On : February 18, 2023 / 6:43 PM IST

Kangana Ranaut : దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి, RRR సినిమాలు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాయి. బాహుబలి సినిమాతో ఇంటర్నేషనల్ మార్కెట్ కి మనమేంటో ఒక శాంపిల్ చూపించిన రాజమౌళి.. RRR సినిమాతో ఏకంగా ఇంటర్నేషనల్ మూవీస్ తో పోటీ పడేలా చేశాడు. ఇప్పటికే ఈ చిత్రంతో పలు అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకోగా, ఆస్కార్ బరిలో కూడా నిలిచింది. దీంతో నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు పలు మీడియాలు రాజమౌళి అండ్ టీంని ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాయి.

Rajamouli : మత వివాదంలో చిక్కుకున్న రాజమౌళి..

ఈ క్రమంలోనే ఒక నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు మత వివాదానికి తెర లేపాయి. ‘మతం అనేది ఒక రకమైన దోపిడీ’ అంటూ మతం పై తనకి ఉన్న అభిప్రాయాన్ని తెలియజేశాడు. అయితే ఈ వ్యాఖ్యలను కొంతమంది ఖండిస్తున్నారు. ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని, క్షమాపణ చెప్పాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా రాజమౌళి పై దాడికి దిగుతున్నారు. దీంతో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ రంగంలోకి దిగింది. రాజమౌళి చేసిన తప్పేంటో చెప్పాలి అంటూ గట్టిగా ప్రశ్నించింది.

“మర్చిపోతున్న మన నాగరికతను గుర్తు చేసేలా బాహుబలి తీయడం ఆయన తప్పా? మన జాతీయతను తెలియజేసేలా RRR తీయడం ఆయన తప్పా? లేదా అంతర్జాతీయ రెడ్ కార్పెట్‌లపై మన సంప్రదాయ పద్దతిలో ధోతీని ధరించి వెళ్లడం ఆయన తప్పా? దయచేసి ఆయన చేసిన తప్పు ఏంటో చెప్పండి. మన సంప్రదాయాలను, ధర్మాలను అంతర్జాతీయ స్థాయి వరకు తీసుకు వెళ్లినందుకు ఆయన్ని చూసి మనం గర్వ పడాలి. అది మానేసి ఎవరైనా ఆయన్ని ఏమన్నా అంటే ఊరుకునేది లేదు. ఎందుకంటే ఆయన గొప్ప మేధావి, జాతీయవాది” అంటూ వరుస ట్వీట్ లు వేస్తూ రాజమౌళికి సపోర్ట్ చేస్తూ వచ్చింది.