Pawan Kalyan: ‘వారసుడు’ కోసం వస్తున్న వీరమల్లు.. రాజుగారి ప్లాన్ మామూలుగా లేదుగా!

తమిళ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వారిసు’ ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Pawan Kalyan: ‘వారసుడు’ కోసం వస్తున్న వీరమల్లు.. రాజుగారి ప్లాన్ మామూలుగా లేదుగా!

Pawan Kalyan To Grace Varisu Audio Launch Event

Updated On : December 15, 2022 / 4:46 PM IST

Pawan Kalyan: తమిళ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వారిసు’ ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Varisu: ‘వారసుడు’కి గట్టి పోటీనిస్తున్న సీనియర్ హీరోలు!

ఇక ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ కాగా, ఈ సినిమాకు సంబంధించిన ఆడియె లాంచ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌‌ను ఆహ్వానించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ ఈవెంట్‌కు పవన్ కళ్యాణ్ వస్తే, వారిసు చిత్రంపై తెలుగునాట కూడా మంచి అంచనాలు క్రియేట్ చేయొచ్చని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

Varisu: వారసుడు హిందీ టైటిల్ ఏమిటో తెలుసా.. నెట్టింట వైరల్‌గా మారిందిగా!

కాగా, ఈ ఆడియో లాంఛ్ ఈవెంట్‌ను డిసెంబర్ 24న నిర్వహిస్తారనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. మరి నిజంగానే వారిసు చిత్ర ఆడియో లాంచ్‌కు పవన్ కల్యాణ్ హాజరవుతాడా లేక వేరే ఎవరైనా గెస్ట్ వస్తారా అనేది చూడాలి.