Producer SKN : నాన్న నువ్వు లేకుండా తొలిసారి.. నిర్మాత SKN ఎమోషనల్ పోస్ట్..
తాజాగా నిర్మాత SKN తన తండ్రిని తలుచుకుంటూ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు.

Producer SKN Emotional Post on His father Goes Viral
Producer SKN : అల్లు అర్జున్ ఫ్యామిలీతో ఎంతో అనుబంధం ఉన్న వ్యక్తి శ్రీనివాస కుమార్ అలియాస్ SKN. నిర్మాతగా మారి సినిమాలు చేస్తూ ‘బేబీ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు SKN. ఇక అతని స్పీచ్ లతో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యారు. ప్రస్తుతం నిర్మాతగా బిజీగా ఉన్నాడు SKN. అయితే ఇటీవల నిర్మాత SKN తండ్రి గాదె సూర్యప్రకాశరావు జనవరి 4న మరణించారు. ఆ సమయంలో పలువురు సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించి SKNని పరామర్శించారు.
Also Read : Prabhas : ముంబై, కోల్‌కతాల మధ్య మహా యుద్ధం.. భైరవగా ప్రభాస్ లుక్ అదుర్స్..
తాజాగా నిర్మాత SKN తన తండ్రిని తలుచుకుంటూ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. నిన్న SKN తండ్రి పుట్టిన రోజు కావడంతో తన తండ్రి పాత ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసి.. ఈ రోజు నాన్న పుట్టిన రోజు. నాన్న లేకుండా తొలిసారి. ఇంకొన్ని రోజులు నాతోనే ఉండి ఉంటే బాగుండేది. కనీసం వెళ్ళిపోతారు అని తెలిసినా ఇంక ఎన్నో మాట్లడేవాడిని. నాన్నతో చెప్పాల్సింది చాలా మిగిలి ఉంది అనిపిస్తుంది. ఈ ఫీలింగ్ అసలు నచ్చటం లేదు. ఎవరి మీద ఈ కోపం తీర్చుకోవాలో కూడా తెలియట్లేదు. నాన్న నీకు నా ఫీలింగ్స్ తెలుస్తాయో లేదో తెలియదు, నా మాటలు రీచ్ అవుతాయో లేదో కూడా తెలియదు కానీ హ్యాపీ బర్త్ డే నాన్న. లవ్ యు & మిస్ యు అంటూ పోస్ట్ చేశారు.
దీంతో నిర్మాత SKN పోస్ట్ వైరల్ గా మారింది. మరోసారి పలువురు నెటిజన్లు, ప్రముఖులు SKN ని కామెంట్స్ రూపంలో ఓదారుస్తున్నారు.