RGV: అల్లు అర్జున్ కేసు గురించి సంబంధిత అధికారులకి నా 4 ప్రశ్నలు: రామ్ గోపాల్‌ వర్మ

పుష్కరాలు, బ్రహ్మోత్సవాల్లాంటి ఉత్సవాల్లో తోపులాటలో భక్తులు పోతే దేవుళ్లని అరెస్ట్ చేస్తారా? అని ఆర్జీవీ అన్నారు.

RGV: అల్లు అర్జున్ కేసు గురించి సంబంధిత అధికారులకి నా 4 ప్రశ్నలు: రామ్ గోపాల్‌ వర్మ

Updated On : December 13, 2024 / 7:47 PM IST

సినీ హీరో అల్లు అర్జున్ కేసు గురించి సంబంధిత అధికారులకి సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నాలుగు ప్రశ్నలు వేశారు.

1. పుష్కరాలు, బ్రహ్మోత్సవాల్లాంటి ఉత్సవాల్లో తోపులాటలో భక్తులు పోతే దేవుళ్లని అరెస్ట్ చేస్తారా?

2. ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలలో ఎవరైనా పోతే రాజకీయ నాయకులని అరెస్ట్ చేస్తారా?

3. ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ లో ఎవరైనా పోతే హీరో, హీరోయిన్లని అరెస్ట్ చేస్తారా?

4. భద్రత ఏర్పాట్లు పోలీసులు, ఆర్గనైజర్లు తప్ప ఫిలిం హీరోలు, ప్రజా నాయకులు ఎలా కంట్రోల్ చెయ్యగలరు?

అని రామ్ గోపాల్ వర్మ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

కాగా, సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌ అరెస్టయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయనకు ఇచ్చింది కేవలం మధ్యంతర బెయిల్ మాత్రమే. రెగ్యులర్ బెయిల్ నాంపల్లి కోర్టులో దాఖలు చేసుకోవాని హైకోర్టు సూచించింది. మధ్యంతర బెయిల్ నాలుగు వారాలు మాత్రమే ఉంటుంది.

అల్లు అర్జున్ ను వెంటనే విడుదల చేయ్యాలని హైకోర్టు ఆదేశించింది. వ్యక్తిగత పూచికత్తు సమర్పించాలని చెప్పింది. 50 వేల రూపాయల షూరిటీ సమర్పించాలని చెప్పింది. మరోవైపు, అల్లు అర్జున్ కుటుంబ సభ్యులను చిరంజీవి, నాగబాబు, రానా, సుకుమార్ పరామర్శించారు.

Botcha Satyanarayana : ప్రభుత్వం తొందరపడింది..! అల్లు అర్జున్ అరెస్ట్‌పై వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు..