RRR: సీడెడ్‌లో సరికొత్త రికార్డు సృష్టించిన ఆర్ఆర్ఆర్!
టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు....

RRR
RRR: టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయడంతో ఈ సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు క్యూ కట్టారు. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తొలిరోజే కొన్ని సరికొత్త రికార్డులను క్రియేట్ చేసి తన సత్తా చాటుకుంది.
RRR: అక్కడ మైల్‌స్టోన్ మార్క్‌ను అందుకున్న ఆర్ఆర్ఆర్!
అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి దాదాపు నెలరోజులు కావొస్తున్న తరుణంలో ఈ మూవీ మరొక సరికొత్త రికార్డును తన పేరుపై రాసుకుంది. కాగా తాజాగా ఈ మూవీ సీడెడ్ తిరుగులేని రికార్డును క్రియేట్ చేసి అందరి చూపులు మరోసారి తనవైపు తిప్పుకుంది. సీడెడ్ ప్రాంతంలో ఏ సినిమా కూడా సాధించలేకపోయిన రూ.50 కోట్ల షేర్ మార్క్‌ను ఆర్ఆర్ఆర్ సాధించింది. దీంతో సీడెడ్‌లో ఇప్పటివరకు రిలీజ్ అయిన ఏ సినిమా కూడా ఈ తరహా ప్రదర్శన ఇవ్వలేదని సినీ వర్గాలు అంటున్నాయి.
RRR: ఆర్ఆర్ఆర్ 22 రోజుల వరల్డ్‌వైడ్ కలెక్షన్స్.. ఎంతంటే?
తారక్ కొమురం భీమ్ పాత్రలో నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించాడు. ఈ సినిమాలో అందాల భామ ఆలియా భట్, ఒలివియా మారిస్‌లు హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించగా, డివివి.దానయ్య ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేశాడు. మరి ఇన్ని రికార్డులను క్రియేట్ చేసిన ఆర్ఆర్ఆర్ టోటల్ రన్‌లో ఎంతమేర వసూళ్లు సాధిస్తుందో చూడాలి.