Shah Rukh Khan: జవాన్ టైటిల్ వీడియో.. అదరగొట్టిన షారుఖ్!

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ చాలా గ్యాప్ తరువాత తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జవాన్’ కోసం ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ఇప్పటికే అందరికీ తెలిసిన విషయమే....

Shah Rukh Khan: జవాన్ టైటిల్ వీడియో.. అదరగొట్టిన షారుఖ్!

Shah Rukh Khan Jawan Title Video Impressive

Updated On : June 3, 2022 / 4:28 PM IST

Shah Rukh Khan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ చాలా గ్యాప్ తరువాత తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జవాన్’ కోసం ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ఇప్పటికే అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమాను తమిళ దర్శకుడు అట్లీ ఎలాంటి కథతో తెరకెక్కిస్తున్నాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. తమిళంలో మంచి సక్సెస్ రికార్డ్ ఉన్న అట్లీ, బాలీవుడ్‌లో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడా అని అందరూ చూస్తున్నారు. అయితే కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ మాత్రం గతకొంత కాలంగా సరైన హిట్లు లేక ఢీలా పడిపోయాడు.

Shah Rukh Khan: మార్వెల్ స్టూడియో సూపర్ హీరో షారూఖ్? బెనెడిక్ట్ కుంబర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

కాగా.. ఈసారి అట్లీతో కలిసి బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏమిటో చూపించాలని చాలా గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా అట్లీతో షారుఖ్ తెరకెక్కిస్తున్న సినిమాకు సంబంధించిన టైటిల్ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ టైటిల్ వీడియోలో షారుఖ్ ముఖం కనిపించకుండా ఓ గుడ్డను చుట్టుకుని కనిపించాడు. ఇక ఆయన తనదైన స్టయిల్‌లో నడుచుకుంటూ రావడం.. భారీ ఎత్తున ఆయుధాలను చూపించారు. అయితే ఈ వీడియోలో కింగ్ ఖాన్ పూర్తిగా గాయాలతో ఉన్నట్లుగా దర్శకుడు అట్లీ చూపించాడు.

Shah Rukh Khan: హై ఎనర్జీతో యాక్టివ్‌గా మారిన షారుఖ్.. బాద్షా ఈజ్ బ్యాక్!

ఇక ఈ వీడియోలో షారుఖ్ ఓ జవాన్‌గా మనకు లాస్ట్‌లో రివీల్ చేశారు. అయితే ఈ వీడియోకు మేజర్ అసెట్ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా షారుఖ్ అనే చెప్పాలి. ఇక ఈ వీడియోను బీజీఎం మరో లెవెల్‌కు తీసుకెళ్లిందని చెప్పాలి. ఇటీవల షారుఖ్ చేసిన సినిమాల్లో ఇలాంటి బీజీఎం వినిపించలేదని ఆయన అభిమానులు అంటున్నారు. మరి ఈ సినిమాలోని మిగతా నటీనటులు, సినిమా టెక్నీషియన్లు ఎవరనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ సినిమాను 02 జూన్ 2023లో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.