Unstoppable with NBK : బాలయ్యను కలిసిన వెంకీ మామ.. అన్‌స్టాపబుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు రెడీగా ఉండండి..
ఆహా వేదికగా నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్‌గా వ్యహరిస్తున్న అన్‌స్టాపబుల్ షో దూసుకుపోతుంది

Victory Venkatesh and Director Anil Ravipudi in Unstoppable show shooting
ఆహా వేదికగా నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్‌గా వ్యహరిస్తున్న అన్‌స్టాపబుల్ షో దూసుకుపోతుంది. విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి కాగా ప్రస్తుతం నాలుగో సీజన్ నడుస్తోంది. ఇప్పటికే ఆరు ఎపిసోడ్స్ ప్రేక్షకుల ముందుకు రాగా వాటికి అదిరిపోయే రెస్సాప్స్ వచ్చింది. ఇక ఏడో ఎపిసోడ్‌కు ఎవరు వస్తారా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏడో ఎపిసోడ్‌లో వెంకీమామ సందడి చేయనున్నాడు.
విక్టరీ వెంకటేష్ నటిస్తున్న మూవీ సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2025 జనవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా హీరో వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడిలు అన్‌స్టాపబుల్ షోకి వచ్చారు.
హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో నేడు (ఆదివారం) ఈ ఎపిసోడ్ షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే వెంకీ, అనిల్ స్టూడియోకి చేరుకోగా ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బాలయ్య, వెంకీ ని ఆప్యాయంగా పలకరించారు.
సరదాగా మాట్లాడే వెంకీమామతో బాలయ్య ఏం ఆటలు ఆడించారో, ఎలాంటి విషయాలను అడిగారో తెలుసుకోవాలంటే ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యే వరకు వెయిట్ చేయక తప్పదు.