Vijay Sethupathi : మామూలు కాంబినేషన్ కాదుగా..
రెండు సినిమాలు మెగా ఫ్యామిలీతో చేసిన విజయ్ సేతుపతి మూడో సినిమాతో నందమూరి ఫ్యామిలీ హీరోతో నటించబోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి..

Vijay Sethupathi
Vijay Sethupathi: ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి.. ప్రస్తుతం సౌత్ బిజియ్యెస్ట్ ఆర్టిస్టుల్లో ఒకరు. డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడం వల్ల స్టార్ హీరోల సినిమాలు కూడా వదులుకునేంత బిజీ ఆయన. ‘సైరా’ లో పాండిరాజ్ క్యారెక్టర్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి, ‘ఉప్పెన’ లో రాయణం పాత్రతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
Super Deluxe : ‘ఆహా’లో ఆగస్ట్ 6న విమర్శకుల ప్రశసంలు పొందిన ‘సూపర్ డీలక్స్’ ప్రీమియర్..
రెండు సినిమాలు మెగా ఫ్యామిలీతో చేసిన విజయ్ సేతుపతి మూడో సినిమాతో నందమూరి ఫ్యామిలీ హీరోతో నటించబోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. బాలయ్య ‘అఖండ’ తర్వాత ఇటీవలే ‘క్రాక్’ తో కిరాక్ హిట్ కొట్టిన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీస్ బ్యానర్‌లో సినిమా చెయ్యబోతున్నారు.
Vijay Sethupathi : ఎన్టీఆర్ సినిమాలో విజయ్ సేతుపతి..?
ఇప్పటికే థమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా కన్ఫమ్ అయ్యారు. ఓ కీ క్యారెక్టర్ కోసం జయమ్మ, వరలక్ష్మీ శరత్ కుమార్ ఫిక్స్ చేశారని సమాచారం. ఇక మరో కీలకపాత్ర అంటే విలన్ రోల్ కోసం ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతిని ఫైనల్ చేశారని అంటున్నారు. ఇప్పటికే కథ విన్న విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందని సమాచారం.
Balakrishna : 110వ సినిమా వరకు బాలయ్య లైనప్ అదిరిందిగా..!