ఢిల్లీ ఎన్నికలు : మైకులు బంద్..ఎక్కడికక్కడే గప్ చుప్

  • Published By: madhu ,Published On : February 6, 2020 / 12:25 PM IST
ఢిల్లీ ఎన్నికలు : మైకులు బంద్..ఎక్కడికక్కడే గప్ చుప్

Updated On : February 6, 2020 / 12:25 PM IST

దేశ రాజధాని ఢిల్లీలో మైకులు మూగబోయాయి. ఇన్ని రోజులు ప్రచారం నిర్వహించిన అభ్యర్థులు..కాస్తా రెస్ట్ తీసుకుంటున్నారు. ఓటర్లు ఎవరికి పట్టం కడుతారన్న లెక్కలు వేసుకుంటున్నారు. 2020, జనవరి 06వ తేదీ గురువారం సాయంత్రం 06 గంటలకు ఎన్నికల క్యాంపెయిన్ ముగిసింది. ఫిబ్రవరి 08వ తేదీన 70 స్థానాల్లో పోలింగ్ జరుగనుంది. ప్రధానంగా ఆప్, బీజేపీ పార్టీల మధ్య పోరు కొనసాగనుంది. రెండోసారి గెలుస్తామని ఆప్, ఢిల్లీలో కాషాయ జెండా ఎగురవేస్తామని బీజేపీ పార్టీలు ధీమాతో ఉన్నాయి. 

BJP ప్రచారం : –
గురువారం చివరి రోజు ఆప్, బీజేపీ పోటాపోటీగా ప్రచారం నిర్వహించాయి. కేంద్ర మంత్రి అమిత్ షా రోడ్ల షోతో హోరెత్తించారు. సీమపురి, హరినగర్, మదిపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్ షో నిర్వహించారు. ముండ్క, సుల్తాన్ పూర్ మజ్రలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రచారం చేశారు. అతిరథ మహారథులతో ప్రచారం నిర్వహించింది. దేశ ప్రధానితో సహా, 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 200 మంది ఎంపీలతో ప్రచారం నిర్వహించింది బీజేపీ. అమిత్ షా ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. 

AAP తరపున కేజ్రీ విస్తృత ప్రచారం :-
ఆప్ తరపున అన్నీ తానై నడిపించారు ప్రస్తుత సీఎం కేజ్రీవాల్. రోడ్ షోలు, బహిరంగసభలు నిర్వహిస్తూ..బిజీ బిజీగా మారిపోయారు. బీజేపీ అభ్యర్థి దగ్గర సీఎం అభ్యర్థి లేరని ప్రస్తుత సీఎం కేజ్రీవాల్ విమర్శల వర్షం కురిపించారు. అన్ని నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహించారు. 

* ఫిబ్రవరి 08వ తేదీన ఢిల్లీలో ఎన్నికలు. 
* ఫిబ్రవరి 11న ఎన్నికల ఫలితాలు. 
* 190 కంపెనీల కేంద్ర బలగాల మోహరింపు. 
* 42 వేల మంది పోలీసులు, 19 వేల మంది హోంగార్డులతో బందోబస్తు. 

గెలుస్తామని కేజ్రీ ధీమా :-
ఐదేళ్లలో చేసిన అభివృద్ధే తమను గెలిపిస్తుందని కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. యువతకు ఉపాధి, ప్రజలకు విద్య, వైద్యం అందించడమే..తమ లక్ష్యమని వెల్లడిస్తూ..ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. షాహెన్ బాగ్, ఇతర అంశాలతో చర్చించడానికి తాను రెడీ అని, కానీ అమిత్ షా తయారుగా లేడని తెలిపారు. చర్చ పేరు ఎత్తితే..బీజేపీ పారిపోతోందని ఎద్దేవా చేశారు. 

భారీ నగదు స్వాధీనం :-
ఇదిలా ఉంటే..ఓటర్లను ఆకట్టుకోవడాని పార్టీలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. నగదు, విలువైన వస్తువులను ఇచ్చేందుకు ప్లాన్స్ వేసుకుంటున్నారు. అయితే..ఎన్నికల నిఘా అధికారులు జరిపిన తనిఖీలు, సోదాల్లో డబ్బు, ఇతరత్రా వస్తువులను సీజ్ చేశారు. 10 కోట్ల నగదు, 96 వేల లీటర్ల మద్యం, 774 కిలో డ్రగ్, రూ. 32 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను సీజ్ చేశారు. ఈ మేరకు జాతీయ సంస్థ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది. 
ఆప్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ. 

2015లో ఆప్..67 స్థానాల్లో విజయం :-
* సామాన్యుడిగా వచ్చి ముఖ్యమంత్రిగా ఎదిగిన అరవింద్‌ కేజ్రీవాల్‌ మరోసారి అధికారాన్ని దక్కించుకునేందుకు సన్నద్ధమవుతున్నారు.
* ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌కు చెందిన రాజకీయ కన్సల్టెన్సీ ఐ-ప్యాక్‌(ఇండియన్‌ ప్యాక్‌)తో కేజ్రీ చేతులు కలిపారు. 
* జన్ లోక్ పాల్ బిల్లు కోసం ప్రముఖ గాంధేయవాది, సామాజిక కార్యకర్త అన్నా హాజారే…కలిసి ఉద్యమించారు అరవింద్ కేజ్రీవాల్. 
* 2012 నవంబర్‌లో ఆమ్ ఆద్మీ పేరిట పార్టీని స్థాపించారు. 

* తొలిసారి ముఖ్యమంత్రిగా 49 రోజుల పాటు పదవిలో కొనసాగారు కేజ్రీ. జనలోక్ పాల్ బిల్లుకు ఆమోదం లభించకపోవడంతో ఆయన రాజీనామా చేశారు. 
* తర్వాత  2015 ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 67 స్థానాల్లో విజయదుంధుబి మ్రోగించింది ఆప్. 
* రెండోసారి సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు కేజ్రీవాల్. 

* కానీ..MCD ఎన్నికల్లో మాత్రం ఆప్‌కు ఎదురు దెబ్బలు తగిలాయి. 
* తిరిగి మరోసారి అధికారాన్ని దక్కించుకొనేందుకు కేజ్రీవాల్ సన్నద్దమౌతున్నారు. 
 

* మరి ఓటర్ ఎటువైపు మొగ్గు చూపుతాడో చూడాలి.