జైట్లీకి అనారోగ్యం ? : అమెరికాకు జైట్లీ

  • Published By: madhu ,Published On : January 16, 2019 / 12:34 PM IST
జైట్లీకి అనారోగ్యం ? : అమెరికాకు జైట్లీ

Updated On : January 16, 2019 / 12:34 PM IST

ఢిల్లీ : కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అమెరికా పయనం సందేహాలను రేపుతోంది. తీవ్ర అనారోగ్యంతోనే ఆయన అత్యవసరంగా న్యూయార్క్‌కి వెళ్లారంటూ ప్రచారం జరుగుతోంది. శరీరంలో వేగంగా వ్యాపించే క్యాన్సర్‌తో ఆయన బాధపడుతున్నారని..కనీసం రెండు వారాల వరకూ అమెరికాలోనే గడపనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఓటాన్ అక్కౌంట్ బడ్జెట్ కూడా జైట్లీ ప్రవేశపెట్టలేకపోవచ్చని..ఆయన స్థానంలో ఇంకెవరైనా బడ్జెట్ ప్రవేశపెడతారని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ది వైర్ అనే మేగజైన్ ఓ కథనం ప్రచురించింది. 
గతంలో జైట్లీకి కిడ్నీ ఆపరేషన్ జరిగింది. ఈ సమయంలో పీయూష్ గోయల్ ఆయన శాఖని చూశారు. తాజాగా ఆయన రెండు వారాల పాటు విదేశాలకు వెళ్లినట్లు టాక్. ఆపరేషన్‌తో పాటు కీమోథెరపీ చికిత్సలు జరుగుతాయని తెలుస్తోంది. ఆపరేషన్‌లు చేసుకున్న అనంతరం వెంటనే ఇండియాకు వచ్చి విధులకు హాజరవడం కుదిరే అవకాశం లేదు. కేవలం పరీక్షల కోసమే వెళ్లారా ? లేక ఇంకేమిటన్నది మాత్రం సష్టత లేదు.