మోడీ మళ్లీ ప్రధాని అయితేనే కశ్మీర్ సమస్యకు పరిష్కారం
నరేంద్రమోడీ మరోసారి భారత ప్రధాని కావాలని కోరుకుంటున్నానన్నారు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.

నరేంద్రమోడీ మరోసారి భారత ప్రధాని కావాలని కోరుకుంటున్నానన్నారు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.
నరేంద్రమోడీ మరోసారి భారత ప్రధాని కావాలని కోరుకుంటున్నానన్నారు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. భారత్ లో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తేనే కశ్మీర్ సమస్యకు ఓ విధమైన పరిష్కారం దొరుకుతుందని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు.
Read Also : వీవీ ప్యాట్స్ లెక్కింపు : పొలిటికల్ పార్టీల్లో కొత్త ఆందోళన
కాంగ్రెస్ కనుక భారత్ లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ తో సెటిల్మెంట్ కోసం కాంగ్రెస్ ప్రయత్నాలు చేయకపోవచ్చన్నారు. కొద్ది మంది విదేశీ జర్నలిస్ట్ లతో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇమ్రాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.కశ్మీర్ విషయంలో సైనిక చర్య ద్వారా పరిష్కారం దొరకదన్నారు.రాజకీయ పరిష్కారమార్గంతోనే కశ్మీర్ లో శాంతి నెలకొంటుందని అన్నారు.
భారత్ లో ఇప్పుడు ఏం జరుగుతుందో ఆశక్తిగా గమనించాల్సి వస్తుందని తాను ఎప్పుడూ ఆలోచించలేదన్నారు.భారత్ లోని ముస్లింలు ప్రస్తుతం అతివాద హిందూ జాతీయవాదం కారణంగా భాధపడుతున్నారని అన్నారు. భారత ప్రధాని మోడీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ల ఎలక్షనీరింగ్ అంతా భయం, జాతీయవాదం మీదనే జరుగుతుంటుందని ఇమ్రాన్ అన్నారు.
Read Also : కమల్‌కు మద్దతివ్వడం లేదు – రజనీకాంత్