ఇండియాలో విచిత్రమైన పరిస్థితి.. రికవరీలతో పాటు పెరుగుతున్న కొత్త కరోనా కేసులు

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కరోనా కొత్త కేసుల్లో పెరుగుతూనే ఉన్నాయి. నిత్యం సుమారు 17 వేల కేసులు నమోదవుతున్నాయి. నిన్న(మార్చి 9,2021) రోజూవారీ కేసుల్లో కొద్దిమేర తగ్గుదల కనిపించినప్పటికీ, మరోసారి 17వేల 921 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. అయితే గడిచిన 24 గంటల్లో 20వేల 652 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకోవడం కాస్త ఊరటనిచ్చే అంశం. ఇప్పటివరకు కోటి 12లక్షల 62వేల 707 మందికి కొవిడ్ సోకగా..కోటి 9లక్షల 20వేల 046 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రికవరీ రేటు 96.90 శాతంగా ఉంది.

ఇండియాలో విచిత్రమైన పరిస్థితి.. రికవరీలతో పాటు పెరుగుతున్న కొత్త కరోనా కేసులు

Updated On : March 10, 2021 / 10:56 AM IST

corona cases in india: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కరోనా కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. నిత్యం సుమారు 17 వేల కేసులు నమోదవుతున్నాయి. నిన్న(మార్చి 9,2021) రోజువారీ కేసుల్లో కొద్దిమేర తగ్గుదల కనిపించినప్పటికీ, మరోసారి 17వేల 921 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. అయితే గడిచిన 24 గంటల్లో 20వేల 652 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకోవడం కాస్త ఊరటనిచ్చే అంశం.

రికవరీ కేసులు రోజూ పెరుగుతున్నాయని ఆనంద పడదామన్నా… కొత్త కేసులు కూడా పెరుగుతూనే ఉండటం ఆందోళనకు గురి చేస్తోంది. కొత్త కేసులు తగ్గితేనే దేశంలో కరోనా తగ్గుతున్నట్లు లెక్క అని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు కోటి 12లక్షల 62వేల 707 మందికి కొవిడ్ సోకగా.. కోటి 9లక్షల 20వేల 046 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రికవరీ రేటు 96.90 శాతంగా ఉంది.

ఇక, యాక్టివ్ కేసులు లక్షా 84వేల 598 ఉండగా..ఆ రేటు 1.64 శాతానికి చేరింది. మరోవైపు, క్రితం రోజు(77 మరణాలు)తో పోల్చుకుంటే మరణాల సంఖ్యలో భారీ పెరుగుదల కనిపించింది. గడిచిన 24 గంటల్లో 133 మంది చనిపోయారు. మొత్తంగా లక్షా 58వేల 063 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. నిన్న 7లక్షల 63వేల 081 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. దాంతో ఇప్పటివరకు పరీక్షించిన నమూనాల సంఖ్య 22కోట్ల 34లక్షల 79వేల 877కి చేరుకుంది.

మరోవైపు, దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. మార్చి 9న 13లక్షల 59వేల 173 మంది టీకాలు వేయించుకున్నారు. రెండు దశల్లో భాగంగా 2కోట్ల 43లక్షల 67వేల 906 మంది టీకాలు తీసుకున్నారని కేంద్రం వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 118 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 8,90,884కి చేరింది. కొత్తగా ఎవరూ చనిపోలేదు. మొత్తం మరణాల సంఖ్య 7176గా ఉంది. తాజాగా 89 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 8,82,670కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,038 కేసులు యాక్టివ్‌‌గా ఉన్నాయి. కొత్తగా 45,079 టెస్టులు చెయ్యగా.. మొత్తం టెస్టుల సంఖ్య 1,43,07,165కి చేరింది.

యాక్టివ్ కేసులు 2,864 తగ్గడం ఒకింత ఉపశమనం కలిగించే అంశం. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో నిన్న 9.9వేల కొత్త కేసులు వచ్చాయి. ఆ తర్వాత కేరళలో 2.3వేలు, పంజాబ్‌లో వెయ్యి కేసులు వచ్చాయి. మహారాష్ట్రలో నిన్న 56 మంది చనిపోగా… పంజాబ్‌లో 20 మంది, కేరళలో 16 మంది చనిపోయారు. ఇప్పటివరకూ దేశంలో 2.44 కోట్ల మందికి వ్యాక్సిన్లు వేశారు. అమెరికా, చైనా తర్వాత ఎక్కువ వ్యాక్సిన్లు వేసిన మూడో దేశంగా ఇండియా నిలిచింది. ఇండియా తర్వాత బ్రిటన్ నాలుగో స్థానంలో ఉంది.

తెలంగాణలో కొత్తగా 189 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3లక్షల 342కి చేరింది. నిన్న(మార్చి 9,2021) రాత్రి 8 గంటల వరకు 39వేల కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బుధవారం(మార్చి 10,2021) ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది.

గడిచిన 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 1,646కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 176 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2లక్షల 96వేల 916కి చేరింది.

ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 26లక్షల 20వేల 757 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 11.81 కోట్లు దాటింది. కొత్తగా 8,564 మంది చనిపోవడంతో… మొత్తం మరణాల సంఖ్య 26.20 లక్షలు దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2.16 కోట్లకు పైగా ఉన్నాయి. ప్రస్తుతం కరోనా సోకిన ప్రతి 100 మందిలో ఇద్దరు చనిపోతున్నారు.