India Corona : దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..!

దేశంలో కొత్తగా 25,920 కేసులు, 492 మరణాలు నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశంలో 2,92,092 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.

India Corona : దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..!

Corona (7)

Updated On : February 18, 2022 / 10:22 AM IST

corona cases in India : భారత్ లో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టింది. దేశంలో క్రమంగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. యాక్టీవ్ కేసులు మూడు లక్షల దిగువకు చేరుకున్నాయి. దేశంలో కొత్తగా 25,920 కేసులు, 492 మరణాలు నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశంలో 2,92,092 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.

దేశంలో 0.68 శాతం యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటి రేటు 2.07 శాతానికి చేరుకుంది. దేశంలో ఇప్పటివరకు 4,27,80,235 కేసులు, 5,10,905 మరణాలు నమోదు అయ్యాయి. దేశంలో 98.12 శాతం కరోనా రికవరీ రేటు ఉంది. నిన్న కరోనా నుంచి 66,254 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం 4,19,77,238 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Corona Virus : కరోనాతో చనిపోయిన తర్వాత మృతదేహంలో వైరస్‌..!

మరోవైపు భారత్ లో 399 రోజులుగా కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 174.64 కోట్ల డోసుల టీకాలు అందజేశారు. నిన్న 37,86,806 డోసుల టీకాలు అందజేశారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 174,64,99,461 డోసుల టీకాలు పంపిణీ చేశారు.