No Confidence Motion : మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై నేడు పార్లమెంట్ లో చర్చ
మణిపూర్ అంశంపై చర్చించాలని పార్లమెంట్ సమావేశాల ప్రారంభం నుంచి విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రధాని మోదీ దీనిపై మాట్లాడాలని అడుగుతున్నాయి. అయితే సభలో మణిపూర్ అంశం చర్చకు నోచుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

Parliament no confidence motion
No Confidence Motion Debate : పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అసలు సిసలైన ఘట్టాని వేళ అయింది. ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై ఇవాళ (మంగళవారం) చర్చ ప్రారంభం కానుంది. మణిపూర్ హింసపై పాలక, విపక్షాల మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అవిశ్వాస తీర్మానంపై వాడివేడీగా చర్చ జరిగే అవకాశం ఉంది. అనర్హత నుంచి ఉపశమనం పొందిన రాహుల్ గాంధీ ఆ పార్టీ తరపున చర్చను ప్రారంభించనున్నారు. రేపు, ఎల్లుండి కూడా అవిశ్వాస తీర్మానంపై లోక్ సభలో చర్చ కొనసాగనుంది.
ఎల్లుండి ప్రధాని మోదీ అవిశ్వాస తీర్మానంపై మాట్లాడనున్నారు. విపక్ష కూటమి ఇండియా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. గతవారం దీనిని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆమోదించారు. మణిపూర్ అంశంపై చర్చించాలని పార్లమెంట్ సమావేశాల ప్రారంభం నుంచి విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రధాని మోదీ దీనిపై మాట్లాడాలని అడుగుతున్నాయి. అయితే సభలో మణిపూర్ అంశం చర్చకు నోచుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
Balochistan Blast : పాకిస్థాన్‌లో పేలుడు…ఏడుగురి మృతి
తద్వారా ప్రధానితో మాట్లాడించవచ్చని విపక్షాలు భావిస్తున్నాయి. పార్టీల బలాబలాల ఆధారంగా స్పీకర్ సభ్యులకు సమయాన్ని కేటాయించనున్నారు. అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో అన్నీ పార్టీలు తమ అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అధికారి పార్టీ బీజేపీ ఇప్పటికే తమ ఎంపీలకు విప్ జారీ చేసింది. ఆగస్టు 11 వరకు పార్లమెంట్ సమావేశాలకు తప్పక హాజరు కావాలని స్పష్టం చేసింది.
మరోవైపు తమ గళాన్ని బలంగా వినిపించేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. అయితే ఈ అవిశ్వాస తీర్మానం వల్ల మోదీ ప్రభుత్వానికి వచ్చిన నస్టమేమీ లేకపోయినా ఓటింగ్ సరళి ఎలా ఉంటుందో అన్న ఆసక్తి నెలకొంది. ప్రభుత్వాన్ని పడగొట్టే బలం విపక్ష కూటమికి లేదు. తమకు మెజారిటీ లేదని కాంగ్రెస్ తరపున అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన గౌరవ్ గొగోయ్ సైతం ఇప్పటికే అంగీకరించారు.
మణిపూర్ పై ప్రభుత్వం మాట్లాడించేందుకే అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చినట్లు స్పష్టం చేశారు. లోక్ సభలో ఎన్డీఏకు 331 మంది సభ్యుల బలం ఉంది. ఒక్క బీజేపీకి 303 మంది ఎంపీలు ఉన్నారు. సభలో బలం నిరూపించుకునేందుకు కావాల్సిన మెజారిటీ 272. ఇండియా కూటమికి 144 మంది ఎంపీలు ఉన్నారు. తటస్థంగా ఉన్న బీఆర్ఎస్, వైసీపీ, బీజేడీ పార్టీలకు 70 మంది సభ్యులు ఉన్నారు.
ఇందులో బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికే అవకాశం ఉంది. పార్లమెంట్ లో అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న వైసీపీ, బీజేడీ ఎంపీలు తీర్మానాన్ని వ్యతిరేకించనున్నట్లు తెలిపారు. దీంతో ఎన్డీఏపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.