E-auction of Modi’s gifts: రేపటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ కానుకల ఈ-వేలం

ప్రధాని నరేంద్ర మోదీకి వచ్చిన జ్ఞాపికలు, బహుమతులను కేంద్ర ప్రభుత్వం రేపటి నుంచి వేలం వేయనుంది. ఇవాళ ఉదయం 10 గంటలకు ఆయా కానుకల వేలం వివరాలను కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలపనున్నారు. రేపు మోదీ పుట్టిన రోజు సందర్భంగా నాల్గవ సారి ఆయన బహుమతుల ఈ-వేలం నిర్వహిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. రాజకీయ నాయకులు, క్రీడాకారులు సహా వివిధ వర్గాల ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీకి బహుమతిగా ఇచ్చిన 1,200కు పైగా వస్తువులు వేలం వేయనున్నట్లు పేర్కొంది.

E-auction of Modi’s gifts: రేపటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ కానుకల ఈ-వేలం

E-auction of Modi's gifts

Updated On : September 16, 2022 / 9:51 AM IST

E-auction of Modi’s gifts: ప్రధాని నరేంద్ర మోదీకి వచ్చిన జ్ఞాపికలు, బహుమతులను కేంద్ర ప్రభుత్వం రేపటి నుంచి వేలం వేయనుంది. ఇవాళ ఉదయం 10 గంటలకు ఆయా కానుకల వేలం వివరాలను కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలపనున్నారు. రేపు మోదీ పుట్టిన రోజు సందర్భంగా నాల్గవ సారి ఆయన బహుమతుల ఈ-వేలం నిర్వహిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. రాజకీయ నాయకులు, క్రీడాకారులు సహా వివిధ వర్గాల ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీకి బహుమతిగా ఇచ్చిన 1,200కు పైగా వస్తువులు వేలం వేయనున్నట్లు పేర్కొంది.

ఆన్‌లైన్‌లో రేపటి నుంచి అక్టోబర్ 2 వరకు మోదీ కానుకుల ఈ-వేలం కొనసాగుతుందని తెలిపింది. pmmementos.gov.in పోర్టల్ ద్వారా జరగనున్న వేలం జరగనుంది. రూ.100 నుండి రూ.10 లక్షల వరకు ధరలు ఉండనున్నాయి. కేంద్రానికి సమకూరిన నిధులను నమామి గంగే మిషన్‌కు అందించనున్నారు. మోదీకి వచ్చిన బహుమతుల్లో క్రీడాకారులు సంతకం చేసిన టీ-షర్టులు, బాక్సింగ్ గ్లోవ్స్, జావెలిన్, రాకెట్‌లు, క్రీడా వస్తువులు ఉన్నాయి.

Bihar Passengers: ప్రయాణికులకు దొరికిపోయి… 10 కి.మీటర్లు రైలు కిటికీకి వేలాడిన దొంగ.. వీడియో వైరల్