విమానంలో సాంకేతిక సమస్య..వారణాశిలో ఎమర్జన్సీ ల్యాండింగ్

  • Published By: venkaiahnaidu ,Published On : September 8, 2019 / 01:04 PM IST
విమానంలో సాంకేతిక సమస్య..వారణాశిలో ఎమర్జన్సీ ల్యాండింగ్

Updated On : September 8, 2019 / 1:04 PM IST

హైదరాబాద్ నుంచి గోరఖ్ పూర్ వెళ్తున్న ఇండిగో ఎయిర్ బస్320 నియో విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానంలో సాంకేతిక సమస్య రావడంతో ఇవాళ(సెప్టెంబర్-8,2019)వారణాశి ఎయిర్ పోర్ట్ లో ఎమర్జన్సీ ల్యాండింగ్ చేశారు.విమానంలో మొత్తం 150మంది ప్రయాణికులు ఉండగా అందరూ సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది. వేరొక విమానంలో ప్రయాణికులను గోరఖ్ పూర్ తరలిస్తున్నట్లు సమాచారం.

ఆగస్టు 27న కూడా విమానం ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్‌లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ పనిచేయకపోవడం వల్ల కాక్‌పిట్‌లో పొగ కనిపించడంతో ఇండిగో విమానం హైదరాబాద్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేసినట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది.