Weather Update: తీరం దాటిన వాయుగుండం.. చెరువులను తలపిస్తున్న గ్రామాలు!

నైరుతి బంగాళాఖాతంలో కొనసాగిన వాయుగుండం శుక్రవారం ఉదయం తీరాన్ని దాటింది. తెల్లవారుజామున 3-4గంటల మధ్యలో ఉత్తర తమిళనాడు వద్ద పుదుచ్చేరి-చైన్నై మధ్య తీరాన్ని తాకింది. ఇది ఇక్కడ నుండి..

Weather Update: తీరం దాటిన వాయుగుండం.. చెరువులను తలపిస్తున్న గ్రామాలు!

Weather Update

Updated On : November 19, 2021 / 7:36 AM IST

Weather Update: నైరుతి బంగాళాఖాతంలో కొనసాగిన వాయుగుండం శుక్రవారం ఉదయం తీరాన్ని దాటింది. తెల్లవారుజామున 3-4గంటల మధ్యలో ఉత్తర తమిళనాడు వద్ద పుదుచ్చేరి-చైన్నై మధ్య తీరాన్ని తాకింది. ఇది ఇక్కడ నుండి పశ్చిమ వాయువ్య దిశగా పయనించి బలహీనపడే అవకాశమున్నట్లు వాతావరణ అధికారులు వెల్లడించారు. వాయుగుండం ప్రభావంతో కనివిని ఎరుగని రీతిలో జలప్రళయం మంచుకొచ్చింది. బుధ, గురువారాలు తమిళనాడుతో పాటు ఏపీలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి.

Weather Update: ముంచుకొచ్చిన వాయు’గుండం’.. నేడు తీరందాటే అవకాశం

రెండు రాష్ట్రాలలో ఇప్పటికే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించగా.. వాయుగుండం కారణంగా ఉత్తర తమిళనాడుతో పాటు ఏపీలోని చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. వాయుగుండం తీరం దాటినా దీని ప్రభావంతో శుక్రవారం కూడా దక్షిణకోస్తా, రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయని ఐఎండీ ప్రకటించింది. అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. తీరం వెంబడి గంటకు 45-65 కిమీ వేగంతో గాలులు వీయనున్నాయని ప్రకటించారు.

Tirupati : అంధకారంలో తిరుపతి ?, కార్తీక పౌర్ణమి సముద్ర స్నానాలకు అనుమతి లేదు!

శుక్రవారం కూడా మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరించగా.. వరదలు, వర్షపు నీటితో ప్రజలు ఇబ్బందులు పడకుండా సహాయ చర్యలకు‌ చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్ఆర్డీఎఫ్ బృందాలు మోహరించాయి. ఇప్పటికే లోతట్టుప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించగా శుక్రవారం కూడా అత్యవసర పరిస్థితిలు ఉంటే తప్ప ప్రజలెవెరూ బయటికి రావద్దని సూచించారు.