‘మోడీ మొరటు నిర్ణయానికి భారత్‌లో సపోర్ట్ లేదు’

‘మోడీ మొరటు నిర్ణయానికి భారత్‌లో సపోర్ట్ లేదు’

Updated On : August 25, 2019 / 8:19 AM IST

కశ్మీర్ ప్రత్యేక అధికారాలను తొలగించే దిశగా ఆర్టికల్ 370ని రద్దు చేసింది మోడీ ప్రభుత్వం. చారిత్రాత్మక విజయం సాధించిందంటూ పలువురు భారత ప్రముఖులంతా ట్వీట్లు చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. రద్దు తర్వాత నుంచి పాక్-భారత్‌ల మధ్య వాతావరణం పూర్తిగా చెడింది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కి చైనా మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇదిలా ఉంటే పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీది మరో సారి విషం కక్కుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. 

గౌతం గంభీర్‌తో పలుమార్లు ట్వీట్ల ద్వారా వాదనకు దిగిన షాహిద్ అఫ్రీది.. మోడీ తీసుకున్న మొరటు నిర్ణయానికి భారత్‌లోనూ ఎక్కువ మంది మద్ధతు ఇవ్వడం లేదని ట్వీట్ చేశాడు. ‘ఐక్యరాజ్య సమితి నుంచి శాంతిని నిరోధిస్తుందని, క్రూరత్వాన్ని అడ్డుకుంటుందని మేమే ఎక్కువగా ఆశించాం. మెజార్టీ భారతీయులు మోడీ తీసుకున్న నిర్ణయానికి సపోర్ట్ చేయడం లేదు. అమానవీయ ఘటనలను ఇప్పటికైనా ఆపితే మంచిద’ని ట్వీట్ చేశాడు. దాంతో పాటు కశ్మీర్‌లో ఇప్పటికీ కర్ఫ్యూ కొనసాగుతుందనే హ్యాష్ ట్యాగ్‌తో పోస్టు పెట్టాడు. 

గతంలో కశ్మీర్‌లో అమాయక ప్రాణాలు బలిగొంటున్న భారత్‌పై ఐక్యరాజ్యసమితి చర్యలు తీసుకోవాలని అఫ్రిది ట్వీట్‌ చేశాడు. దానిపై టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్ తనదైన స్టైల్‌లో ఘాటుగా కౌంట‌ర్ ఇచ్చారు. అఫ్రిది వ్యాఖ్యలను అంతగా పట్టించుకోనక్కరలేదని.. నోబాల్‌తో వికెట్‌ తీసి సంబరాలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడని బీజేపీ ఎంపీ గంభీర్ సెటైర్‌ విసిరాడు.