Monkey Viral Video : కర్తల్ ప్లే చేసిన వానరం.. రాముడి కోసం వచ్చిన హనుమంతుడు అంటున్న నెటిజన్లు

సోషల్ మీడియాలో నిత్యం వీడియోలు వైరల్ అవుతూనే ఉంటుంది. అందులో జంతువుల వీడియోలునెటిజన్లను ఎక్కువగా ఆకట్టుకుంటాయి.

Monkey Viral Video : కర్తల్ ప్లే చేసిన వానరం.. రాముడి కోసం వచ్చిన హనుమంతుడు అంటున్న నెటిజన్లు

Monkey Viral Video

Updated On : October 16, 2021 / 8:07 AM IST

Monkey Viral Video :  సోషల్ మీడియాలో నిత్యం వీడియోలు వైరల్ అవుతూనే ఉంటుంది. అందులో జంతువుల వీడియోలు నెటిజన్లను ఎక్కువగా ఆకట్టుకుంటాయి. జంతువులూ చేసే పనులు అందరిని ఆకట్టుకుంటాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో నెటిజన్లను కట్టిపడేస్తుంది. ఓ వానరం ఎంచక్కా సాధువు ఒడిలో కూర్చుని లయబద్దంగా కర్తల్ ప్లే చేసి అక్కడున్న వారిని ఆశ్చర్యంలో ముంచేసింది. సాధువుల కీర్తనలకు తగినట్లు కర్తల్ వాయిస్తుండటం చూసి ముక్కున వేలేసుకుంటున్నారు.

చదవండి : కొంపముంచిన కోతి.. లక్ష రూపాయలు ఎత్తికెళ్లి రోడ్డుపై చల్లింది

ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా స్వయంగా ఆ రాముడి కోసం దిగి వచ్చిన హనుమాన్‌ అంటూ ముగ్ధులవుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గానీ ఒక కోతి భజన చేస్తున్న సాధువుల చెంతకు చేరింది. వారితో పాటు భక్తి కీర్తనల్లో మునిగియంది. తాళానికి కనుగుణంగా భజనలో ఒక వాయిద్యాన్ని వాయిస్తూ ఆనందంలో మునిగిపోయింది. ఇక అక్కడ ఉన్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా లక్షల్లో వ్యూస్ సంపాదించింది ఈ వీడియో.

చదవండి :   మేకపై పిల్ల కోతి సవారీ.. 130లక్షల మంది మనసు గెలిచిన వీడియో