Viral Video: నడుస్తూ తడబడి జారిన స్టాలిన్.. సీఎం చేతిని పట్టుకుని తీసుకెళ్లిన మోదీ.. వీడియో

ఇంతలో స్టాలిన్ తడబడి ఓ మెట్టుపై కాలు వేయకుండా మరో మెట్టుపై వేసి జారారు.

Viral Video: నడుస్తూ తడబడి జారిన స్టాలిన్.. సీఎం చేతిని పట్టుకుని తీసుకెళ్లిన మోదీ.. వీడియో

PM Modi

Updated On : January 20, 2024 / 1:31 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తమిళనాడు సీఎం స్టాలిన్‌ తాజాగా పాల్గొన్న ఓ కార్యక్రమంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇందుదుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నరేంద్ర మోదీ, స్టాలిన్ పక్కపక్కనే నిలబడి నడుస్తున్నారు.

ఇంతలో స్టాలిన్ తడబడి ఓ మెట్టుపై కాలు వేయకుండా మరో మెట్టుపై వేసి జారారు. దీంతో ఎంకే స్టాలిన్ ఎడమచేతిని పట్టుకుని ఆయనను ముందుకు నడిపించారు మోదీ. ఆ తర్వాత వారిద్దరు కలిసి వేదికపైకి వెళ్లారు.

తాజాగా, చెన్నై నిర్వహించిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు. కాగా, భారత్ 2036 ఒలింపిక్ గేమ్స్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. తాము క్రీడారంగాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు.

కాగా, ఖేలో ఇండియా గేమ్స్‌ను ప్రధాని మోదీ 2018లో ప్రారంభించారు. ప్రతి ఏడాది ఈ గేమ్స్ నిర్వహిస్తారు. గతంలో ఢిల్లీ, పూణే, గువాహటి, పంచకుల, భోపాల్‌లో జరిగాయి. పలు క్రీడల్లో పోటీలు నిర్వహిస్తారు.


Revanth Reddy: లండన్‌ పర్యటనలో సీఎం రేవంత్‌ రెడ్డికి యువతి ఫ్లయింగ్‌ కిస్‌