Rahul Gandhi : మణిపూర్ మండుతుంటే జోకులు వేస్తూ నవ్వుతున్నారు.. కాపాడాలని ప్రధాని మోదీకి లేదు : రాహుల్ గాంధీ

ప్రధాని మోదీ మణిపూర్ లో సాధారణ పరిస్థితులు రావాలని కోరుకోవడం లేదని మణిపూర్ తగలబడాలని కోరుకుంటున్నారని ఆరోపించారు. మణిపూర్ లో భారత్ ను చంపారని పేర్కొన్నారు.

Rahul Gandhi : మణిపూర్ మండుతుంటే జోకులు వేస్తూ నవ్వుతున్నారు.. కాపాడాలని ప్రధాని మోదీకి లేదు : రాహుల్ గాంధీ

Rahul Gandhi (3)

Rahul Gandhi angry Modi : ప్రధాని మోదీపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానికి రాహుల్ కౌంటర్ ఇచ్చారు. దేశ ప్రధాని మణిపూర్ విషయంలో స్పందించిన తీరు హాస్యాస్పదంగా ఉందన్నారు. 4 నెలలుగా మణిపూర్ మండుతుంటే పార్లమెంట్ లో జోకులు వేస్తున్నారు, నవ్వుతున్నారని మండిపడ్డారు. మణిపూర్ విషయంలో ప్రధాని వ్యవహరించిన తీరు సరైంది కాదన్నారు.

మణిపూర్ అంశాన్ని తమాషాగా మార్చారని చెప్పారు. మణిపూర్ లో హింస జరుగుతుంటే ఎందుకు ఆపలేకపోయారని ప్రశ్నించారు. మణిపూర్ మండిపోతూ, ప్రజలు చనిపోతుంటే ప్రధాని మోదీ నవ్వుకుంటూ ఎగతాళి చేశారని తెలిపారు. మణిపూర్ మంటల్లో పెట్రోల్ పోస్తోంది ఎవరని నిలదీశారు.

Udaipur : తన చావుకి భార్య, స్నేహితురాలు కారణమంటూ ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టి సూసైడ్ చేసుకున్న జర్నలిస్ట్

మణిపూర్ విషయంలో డ్రామాలాడుతున్నారని విమర్శించారు. మణిపూర్ వెళ్లి రెండు వర్గాలతో ప్రధాని ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. ప్రధాని మణిపూర్ ఎందుకు వెళ్లట్లేదో తనకు తెలుసు అన్నారు. కారణాలను తాను పంచుకోవడం లేదని చెప్పారు. దేశంలో ఏం జరుగుతుందో ప్రధానికి తెలవడం లేదన్నారు.

మణిపూర్ ని కాపాడాలని ప్రధానికి లేదని పేర్కొన్నారు. మణిపూర్ ని బీజేపీ చంపేసిందని ఆరోపించారు. మణిపూర్ లో చీలిక తెచ్చారని విమర్శించారు. మెయితీలు, కుకీలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతం వెళ్లే పరిస్థితి లేదని, అలా వస్తే చంపుతామని ఓపెన్ గా చెప్తున్నారని వెల్లడించారు. భారత ఆర్మీ రెండు రోజుల్లో మణిపూర్ లో పరిస్థితిని చక్కదిద్దుతుందన్నారు.

Robert Vadra: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూతురి ఫొటోను పోస్ట్ చేస్తూ ప్రియాంక గాంధీ భర్త సంచలన కామెంట్స్

కానీ, ప్రధాని మోదీ మణిపూర్ లో సాధారణ పరిస్థితులు రావాలని కోరుకోవడం లేదని మణిపూర్ తగలబడాలని కోరుకుంటున్నారని ఆరోపించారు. మణిపూర్ లో భారత్ ను చంపారని పేర్కొన్నారు. ప్రధాని మన దేశానికి వాయిస్ కానీ, ఆయన వ్యవహరించిన తీరు బాధాకరం అన్నారు.

ఎంతో మంది ప్రధానులను చూశా, ఎవరు ఇలా వ్యవహరించ లేదని చెప్పారు. ప్రధాని మోదీ మణిపూర్ వెళ్లి అక్కడి ప్రజలతో మాట్లాడి పరిస్థితులు చక్కదిద్దాలని డిమాండ్ చేశారు. మణిపూర్ లో సాధారణ పరిస్థితులు వచ్చే వరకు పోరాడతామని చెప్పారు.