Rahul Gandhi: ఓడ మునిగిపోతుందేమోనని భయపడి ఓడ దూకిన కెప్టెన్ ‘రాహుల్’: కాంగ్రెస్ సీనియర్ నేత వ్యాఖ్యలు
కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా నెహ్రు కుటుంబీకులే ఉండాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ మాజీ వైస్‌ఛైర్మెన్ పీజే కురియన్ అన్నారు.

Kurien
Rahul Gandhi: కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా నెహ్రు కుటుంబీకులే ఉండాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ మాజీ వైస్‌ఛైర్మెన్ పీజే కురియన్ అన్నారు. కేరళలో ఆదివారం ఒక పత్రికకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. “రాహుల్ గాంధీ పార్టీలో సీనియర్లను సంప్రదించడం లేదని, పార్టీకి శాశ్వత అధ్యక్షుడు లేరని, దానికి కారణం రాహుల్ గాంధీ. ఆయన అధ్యక్షుడు కాలేడు మరియు మరెవరినీ అంగీకరించడానికి కూడా సిద్ధంగా లేడు, ”అని కురియన్ అన్నారు. కాంగ్రెస్‌లోని జి-23 నాయకులలో ఒకరైన కురియన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అస్సాం పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ ముఖ్యనాయకుడు రిపున్ బోరా ఆదివారం టీఎంసీలో చేరిన తరుణంలో ప్రస్తుతం పీజే కురియన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Also read:Telangana Governor : గవర్నర్ తమిళి సై కీలక వ్యాఖ్యలు.. అనవసరంగా విమర్శిస్తున్నారు
“2019 లోక్‌సభ ఎన్నికల ఓటమి తర్వాత పార్టీ బాధ్యతల నుండి పారిపోయిన రాహుల్, ఇప్పటికీ పార్టీలో నిబంధనలను నిర్దేశిస్తున్నాడని, ఇది అన్యాయమని కురియన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి శక్తివంతమైన అధ్యక్షుడు కావాలని కురియన్ ఒక ప్రాంతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. “ పార్టీ వరుస ఓటములను ఎదుర్కొంటున్నప్పుడు అధ్యక్ష పదవిని ఎక్కువ కాలం ఖాళీగా ఉంచలేమని, లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కొన్నప్పుడు పార్టీని నడిపించే ధైర్యం రాహుల్ చూపించి ఉండాల్సిందని కురియన్ అభిప్రాయపడ్డారు. కానీ రాహుల్ భాద్యతల నుంచి తప్పుకుని, అనుభవాలేమితో తన చుట్టూ ఉన్న చిల్లర బ్యాచ్ తో చర్చించి నిర్ణయాలు తీసుకుంటాడని కురియన్ వ్యాఖ్యానించారు.
ఓడ మునిగిపోతుందేమోనని భయపడి ఓడ దూకిన కెప్టెన్ అంటూ రాహుల్ నాయకత్వాన్ని కురియన్ సందేహించారు. పార్టీకి సంబందించి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు సరైన చర్చలు జరగడం లేదని, ఇలాంటి పరిస్థితి పార్టీకి ప్రోత్సాహకరం కాదని కురియన్ అన్నారు. ప్రతిసారీ నెహ్రూ-గాంధీ కుటుంబం నుంచి మాత్రమే పార్టీ అధ్యక్షుడిగా ఉండాలనే నిబంధన ఏమీ లేదన్నారు. “అలా నమ్మడంలో లాజిక్ లేదు. ఎక్కువ సామర్థ్యం ఉన్న వ్యక్తులు ఉంటే, పార్టీని నడిపించడానికి వారిని అనుమతించాలి. నెహ్రూ కుటుంబానికి పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వకూడదనే అజెండా జి-23కి లేదని కురియన్ అన్నారు . సంస్థాగత ఎన్నికల ద్వారా రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడైతే మేము వ్యతిరేకించబోమని కూడా ఆయన స్పష్టం చేశారు.
Also read:Cows in Rajasthan: ఆవుల పెంపకానికీ లైసెన్స్ ఉండాల్సిందే: రాజస్థాన్ ప్రభుత్వ వింత నిర్ణయం