Viral video: దీన్ని చికెన్ లెగ్ పీస్ అంటారా? వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు..
దాని కలర్, ఆకారం మొత్తం చికెన్ లెగ్ పీస్‌లా ఉండడంతో దాన్ని..

మన దేశంలో చికెన్ ప్రియులకు లెగ్ పీసులు అంటే చాలా ఇష్టం. చికెన్ పీస్ చూడగానే నోరూరుతుంది. అలాగే, తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన చికెన్ లెగ్ పీస్ వంటి పదార్థాన్ని చూసి అందరి నోరూ ఊరింది. అయితే, చివరకు అది చికెన్ పీస్ కాదని తెలుసుకుని చాలా సర్‌ప్రైజ్ అయ్యారు.
ఓ వ్యక్తి అచ్చం చికెన్ పీస్‌లా కేకును తయారు చేసుకున్నాడు. పైకి దాని కలర్, ఆకారం మొత్తం చికెన్ లెగ్ పీస్‌లా ఉండడంతో దాన్ని అందరూ చికెన్‌గానే భావించారు. దాన్ని కట్ చేసి చూస్తే కేక్ కనపడింది. పైన కారంగా ఉండే చికెన్ ముక్క, కట్ చేశాక తియ్యతియ్యని కేక్‌నుచూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఇటువంటి ఐడియాలు ఎలా వస్తాయంటూ కామెంట్లు చేశారు.
ఇటువంటి కేకులను తయారు చేయడంలో మంచి పేరు తెచ్చుకున్న యూకేకు చెందిన దయీత పాల్ ఈ వీడియో షేర్ చేయగా ఇది తెగ వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 11 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.
View this post on Instagram
Gold: అధిక లాభాల కోసం కొత్తగా బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? ఈ సింపుల్ టిప్స్ మీకోసమే..