Road accident : బెంగళూరు రోడ్డు ప్రమాద మృతుల్లో డీఎంకే ఎమ్మెల్యే కుమారుడు, కోడలు
బెంగళూరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారిలో డీఎంకే ఎమ్మెల్యే కుమారుడు, కోడలు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు.

Bangalore Road Accident (1)
Bangalore road accident : బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారిలో డీఎంకే ఎమ్మెల్యే కుమారుడు, కోడలు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. వేగంగా దూసుకొచ్చిన ‘ఆడి క్యూ3’ కారు రోడ్డు పక్కనున్న కరెంటు స్తంభాన్ని ఢీకొట్టి ఓ భవనంలోకి కారు దూసుకెళ్లటంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే కుమారుడు, కోడలితో ససమాయ మొత్తం ఏడుగురు మృతి చెందారు.
ఆరుగురు ఘటనా స్థలంలోనే కన్నుమూయగా, మరొకరు సెయింట్ జాన్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులో మంటలు చెలరేగడంతో ప్రమాద తీవ్రత తద్వారా మృతుల సంఖ్య కూడా పెరిగింది.
మంగళవారం (31.8.2021) 2:30 గంటల సమయంలో ప్రమాద మృతుల్లో తమిళనాడులోని హోసూరు డీఎంకే ఎమ్మెల్యే వై.ప్రకాశ్ కుమారుడు కరుణాసాగర్, కోడలు డాక్టర్ బిందు కూడా ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. ప్రమాదం అనంతరం కారు నుజ్జు అయిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బెంగళూరు పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.
ఎమ్మెల్యే కుమారుడు కరుణాసాగర్ (28), కోడలు డాక్టర్ బిందుతో పాటు మృతుల్లో 21 ఏళ్ల ఇషిత, 21 ఏళ్ల డాక్టర్ ధనుషా, 23 ఏళ్ల అక్షయ్ గోయల్ మరియు 23 ఏళ్ల రోహిత్ ఉన్నారు.కాగా..కారు ఎయిర్‌బ్యాగులు తెరుచుకోకపోవడంతో వాహనంలో ఉన్న ప్రయాణికులందరూ మరణించినట్లు అవుదుగోడి ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
బెంగళూరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారిలో డీఎంకే ఎమ్మెల్యే కుమారుడు, కోడలు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. వేగంగా దూసుకొచ్చిన ‘ఆడి క్యూ3’ కారు రోడ్డు పక్కనున్న కరెంటు స్తంభాన్ని ఢీకొట్టి ఓ భవనంలోకి కారు దూసుకెళ్లటంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే కుమారుడు, కోడలితో ససమాయ మొత్తం ఏడుగురు మృతి చెందారు.