Indian Students : అమెరికా నుంచి తిరిగివచ్చిన విద్యార్థులు.. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖతో ఏపీ సంప్రదింపులు

ఎన్నో ఆశలతో ఉన్నత విద్య కోసం అమెరికా విమానం ఎక్కిన విద్యార్థులకు అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు షాక్ ఇవ్వడంతో తీవ్ర నిరాశ చెందారు. అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు కారణం చెప్పకుండానే భారత విద్యార్థులు 500 మందిని వెనక్కు పంపిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది...

Indian Students : అమెరికా నుంచి తిరిగివచ్చిన విద్యార్థులు.. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖతో ఏపీ సంప్రదింపులు

Indian Students

Indian Students returned from America: ఎన్నో ఆశలతో ఉన్నత విద్య కోసం అమెరికా విమానం ఎక్కిన విద్యార్థులకు అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు షాక్ ఇవ్వడంతో తీవ్ర నిరాశ చెందారు. అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు కారణం చెప్పకుండానే భారత విద్యార్థులు 500 మందిని వెనక్కు పంపిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. అమెరికా దేశంలో చదువుకునేందుకు వెళ్లిన తెలుగు విద్యార్థులను అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు తిప్పిపంపించిన ఘటనలపై తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి. (Students who have returned from America)

అమెరికాలో కోరుకున్న విశ్వవిద్యాలయంలో సీటు వచ్చినా, వీసా వచ్చినా అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు భారత విద్యార్థులను తిప్పి పంపిన ఉదంతాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరా తీశారు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన విద్యార్థుల వివరాలను సేకరించి , అవసరమైతే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులతో సంప్రదింపులు జరపాలని సీఎంవో అధికారులను సీఎం ఆదేశించారు. (AP contacts with Ministry of External Affairs) అట్లాంటా, చికాగో, శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయాల్లో దిగిన 21 మంది భారతీయ విద్యార్థులను విచారించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు తిరుగు విమానంలో పంపించడం సంచలనం రేపింది.

విద్యార్థులను వెనక్కి పంపించడానికి కారణాలు..
1. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన విద్యార్థుల వద్ద సరైన పత్రాలు చూపించక పోవడం
2. అమెరికా వెళ్లే విద్యార్థులు సోషల్ మీడియాలో చాటింగ్ వల్ల కూడా వారిని తిరిగి పంపించారని అంటున్నారు.అమెరికా వెళ్లక ముందే భారత విద్యార్థులు అక్కడ జాబ్ గురించి ఆరా తీశారు. దీంతో మరికొందరు అమెరికా సందర్శనపై కొందరు సోషల్ మీడియాలో చేసిన చాటింగులే వారి కొంప ముంచాయని నిపుణులు చెబుతున్నారు. చాటింగుల్లో విద్వేషపూరితమైన పోస్టులు ఉంటే వాటిని తీవ్రంగా పరిగణిస్తారు.
3. ఎఫ్-1 వీసా నిబంధనల ప్రకారం చదువు కోవడానికి వెళ్లే విద్యార్థులు చదువు కోసమే అన్నట్లుగా ఉండాలి. వీసా నిబంధనలకు విరుద్ధంగా ఉంటే వారిని అమెరికాలో ప్రవేశించకుండా నిషేధం విధిస్తారు.
4. అమెరికన్ భాష ఉచ్ఛారణ (యాక్సెంట్)ను అర్ధం చేసుకొని ఎలాంటి తడబాటు లేకుండా సమాధానాలు ఇవ్వలేని విద్యార్థులను తిప్పి పంపించారని చెబుతున్నారు. అమెరికా యాక్సెంట్ పై కన్సెల్టెన్సీలు విద్యార్థులకు అవగాహన కల్పించక పోవడం ప్రధాన సమస్యగా మారింది. విద్యార్థి జీఆర్ఈ, టోఫెల్ స్కోర్లను కూడా పరిశీలిస్తారు.
5. అమెరికా వచ్చే విద్యార్థులను ఇమ్మిగ్రేషన్ అధికారులు ర్యాండమ్ గా ఎంచుకొని వారు నిజంగా చదువుకునేందుకు వచ్చారా లేదా ఉద్యోగాలు చేసేందుకు వచ్చారా అనేది చెక్ చేస్తుంటారు.
6. అమెరికాలో విద్యార్థి వీసాపై వచ్చే విద్యార్థులకు చదువుకునేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది. అలా కాకుండా కొందరు విద్యార్థి వీసాపై వచ్చి ఉద్యోగాలు చేస్తూ అమెరికన్లకు ఉద్యోగావకాశాలు లేకుండా చేస్తున్నారనే కారణంతో వారిని తిప్పి పంపించారని కన్సల్టెన్సీల నిర్వాహకులు చెబుతున్నారు.

విద్యార్థుల తనిఖీల్లో వీటిని పరిశీలిస్తారు..
1. విద్యార్థుల ఆర్థిక పరిస్థితి, యూనివర్శిటీ ఫీజులు, బ్యాంకు ఖాతా వివరాలను ఇమ్మిగ్రేషన్ అధికారులు పరిశీలిస్తారు.
2. విద్యార్థి, తండ్రికి సంబంధించిన బ్యాంకు ఖాతాల వివరాలు, బ్యాంకు బ్యాలెన్స్, విద్యార్థులు సమర్పించిన డాక్యుమెంట్లను పోల్చి చూస్తారు.
3. విద్యార్థి ఫేక్ డాక్యుమెంట్లు పెడితే ఇబ్బందులు ఎదురవుతాయి.
4. విద్యార్థికి డెబిట్, క్రెడిట్ కార్డులు ఉన్నాయా? బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది? క్రెడిట్ కార్డు ఉంటే ఎంత వాడారు అనే అంశాలను పరిశీలిస్తారు.
5. ఫోన్ చెక్ చేయొచ్చా? ఫోన్ ఇచ్చిన తర్వాత అందులోని డేటాను చూస్తారు. వాట్సాప్ చాటింగ్‌లు, సోషల్ మీడియాలో పోస్టులను ఇమ్మిగ్రేషన్ అధికారులు పరిశీలిస్తారు.
6. విద్యార్థికి ఏదైనా అనారోగ్యం ఉందా? అనారోగ్యానికి ఏవైనా మందులు వాడుతున్నారా? అనేది కూడా చూస్తారు.
7. అమెరికా దేశంలో ఎవరైనా బంధువులు లేదా స్నేహితులు ఉన్నారా? అన్ లైన్ క్లాసులకు రిజిస్టర్ చేసుకున్నారా అనేది కూడా పరిశీలిస్తారు. మీ వెంట ఎన్ని డాలర్లు తెచ్చుకున్నారని కూడా ప్రశ్నిస్తారు.
8. అనుమానం వస్తే విద్యార్థులను గదుల్లో కూర్చోబెట్టి వారి ఫోన్లు, ల్యాప్ టాప్ లను పరిశీలిస్తారు.

తప్పుడు సమాచారం ఇస్తే భారీ జరిమానా
ఇమ్మిగ్రేషన్ అధికారులు అడిగిన ప్రశ్నలకు తప్పుడు సమాచారం ఇస్తే భారీ జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. తప్పుడు సమాచారానికి రెండున్నర లక్షల డాలర్ల జరిమానా విధించే అవకాశముంది. విద్యార్థులు ఇచ్చే సమాధానాలతో అధికారులు సంతృప్తి చెందక పోతే వారిని మరో విమానంలో తిరిగి స్వదేశానికి పంపిస్తారు.

డిపోర్ట్ చేస్తే అయిదేళ్లపాటు బ్లాక్ లిస్టులోనే..
తప్పుడు సమాచారం ఇచ్చిన విద్యార్థులను డిపోర్ట్ చేస్తే వారిని అయిదేళ్లపాటు బ్లాక్ లిస్టులో పెడతారు. అయిదేళ్ల వరకు చదువుకునేందుకు అమెరికా వెళ్లేందుకు కుదరదు. వారికి వీసా కూడా రాదు. విద్యార్థులను అమెరికా బ్యాన్ చేస్తే అది ఆ దేశానికే పరిమితం అవుతోంది. అయితే అమెరికా విద్యార్థిని డిపోర్ట్ చేసిందని తెలిస్తే ఆ దేశాలకు వెళ్లేందుకు కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశముంది.

కరోనా తర్వాత రికార్డు స్థాయిలో వీసాల జారీ
కరోనా తగ్గాక విదేశీ విశ్వవిద్యాలయాలు ఆఫర్లు ఇస్తూ అధికంగా వీసాలు జారీ చేస్తున్నాయి. చైనా తర్వాత భాతర దేశ విద్యార్థులకు ఎక్కువ సంఖ్యలో వీసాలు జారీ చేశారు. గత ఏడాది 1.15 లక్షల మంది విద్యార్థులకు అమెరికా వీసాలు జారీ చేసింది. ఈ ఏడాది వీటి సంఖ్య రెండు లక్షలకు పెరిగింది. అయితే ఆర్థిక వ్యవహారాలు, సోషల్ మీడియా చాటింగ్, వీసా నిబంధనలను అతిక్రమించడం వంటి వి‌‍షయాల్లో చిక్కులు ఎదురై కొందరు విద్యార్థులు వెనక్కి వచ్చేస్తున్నారు.

అమెరికా వెళ్లే విద్యార్థులు జాగ్రత్తలు తీసుకోండి
అమెరికా, ఇతర దేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు వెళ్లే విద్యార్థులు ఈ కింది జాగ్రత్తలు తీసుకోవాలి.
అమెరికాలో చదువుకోవడానికి వెళ్లి ఉద్యోగాలు చేయకూడదు. అది చట్టవిరుద్ధం. ఉద్యోగాల గురించి ఛాటింగులు చేయరాదు.
మీరు చదవబోయే యూనివర్శిటీ, కోర్సు గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి.
వీసాల మంజూరు కోసం తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించకూడదు.
సోషల్ మీడియాలో రెచ్చగొట్టే, విద్వేషాలు నింపే పోస్టులు పెట్టకూడదు.
యూనివర్శిటీ ట్యూషన్ ఫీజు, ఇతర ఖర్చులకు డబ్బులు చూపించాలి. బ్యాంకు రుణం తీసుకుంటే ఆ పత్రాలు చూపించాలి.
ఐ-20ఫాంను విద్యార్థులే అవగాహన చేసుకొని నింపాలి.
తడుముకోకుండా ఆంగ్లభాషలో జవాబులు చెప్పాలి.