సిరీస్ మనదే : పుణె టెస్టులో భారత్ ఘన విజయం

పుణె టెస్టులో భారత జట్టు ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విక్టరీ కొట్టింది. తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్ల నష్టానికి టీమిండియా 601 పరుగుల

  • Published By: veegamteam ,Published On : October 13, 2019 / 09:44 AM IST
సిరీస్ మనదే : పుణె టెస్టులో భారత్ ఘన విజయం

Updated On : October 13, 2019 / 9:44 AM IST

పుణె టెస్టులో భారత జట్టు ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విక్టరీ కొట్టింది. తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్ల నష్టానికి టీమిండియా 601 పరుగుల

పుణె టెస్టులో భారత జట్టు ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విక్టరీ కొట్టింది. తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్ల నష్టానికి టీమిండియా 601 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ తర్వాత డిక్లేర్ చేసింది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 275 పరుగులకు ఆలౌట్ అయ్యింది. రెండో ఇన్నింగ్స్ లో 189 రన్స్ కే కుప్పకూలింది. దీంతో కోహ్లి సేన గెలిచింది. ఈ సిరీస్ లో భారత్ కు ఇది వరుసగా సెకండ్ విక్టరీ. ఈ గెలుపుతో ఒక టెస్ట్ మ్యాచ్ మిలిగి ఉండగానే.. 2-0 తేడాతో సిరీస్ భారత్ కైవసం చేసుకుంది. పుణె టెస్టులో కెప్టెన్ విరాట్ కోహ్లి డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. భారత జట్టు భారీ స్కోర్ చేయడంలో కీ రోల్ ప్లే చేశాడు. 

తొలి టెస్ట్ మ్యాచ్ లోనూ భారత జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. భారత బ్యాట్స్ మెన్ సెంచరీలతో చెలరేగిపోతే.. బౌలర్లు కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు. సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్ ను బెంబేలెత్తించారు. ఆల్ రౌండ్ ప్రదర్శనతో టీమిండియా దుమ్మురేపింది. వరుస విజయాలతో భారత జట్టు ఆటగాళ్లలో ఆనందం కనిపిస్తోంది.

గురువారం(అక్టోబర్ 10,2019) ఆరంభమైన ఈ టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌ని 601/5తో డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 275 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో.. 326 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందుకున్న టీమిండియా.. సఫారీలను ఫాలోఆన్ ఆడించింది. సఫారీ జట్టు 189 పరుగులకే కుప్పకూల్చింది. దీంతో 4 రోజుల్లోనే మ్యాచ్ ముగిసింది.

సెకండ్ ఇన్నింగ్స్ లో భారత బౌలర్లలో జడేజా, ఉమేష్ యాదవ్ చెరో మూడు వికెట్లు తీశారు. అశ్విన్ 2 వికెట్లు తీశాడు. ఇషాంత్, షమీ లకు చెరో వికెట్ దక్కాయి. సౌతాఫ్రికా సెకండ్ ఇన్నింగ్స్ లో టెయిల్ ఎండర్లు పోరాటం చేశారు. ఎల్గర్ 48 పరుగులతో, ఫిలాండర్ 37 పరుగులతో రాణించారు. స్వదేశంలో టీమిండియాకు ఇది వరుసగా 11వ సిరీస్ విజయం. సొంత గడ్డపై వరుస సిరీస్ విజయాల్లో భారత్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది. భారీ టార్గెట్స్ ను ఛేజ్ చెయ్యలేక రెండు టెస్టుల్లోనూ దక్షిణాఫ్రికా చతికిలబడింది.