టీఎంసీ వైరస్…బీజేపీ వ్యాక్సిన్ : బెంగాల్ బీజేపీ చీఫ్

TMC more dangerous virus than COVID-19 తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)పై బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. టీఎంసీని వైరస్ తో పోల్చారు దిలీప్ ఘోష్. కోవిడ్-19 కంటే టీఎంసీ ప్రమాదకరమైన వైరస్ అని అన్నారు. టీఎంసీ కరోనా కంటే ప్రమాదకరమైందన్న ఆయన.. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా వ్యాక్సిన్ వేసి నిర్మూలిస్తామన్నారు. దక్షిణ 24 పరగణ జిల్లాలోని కుల్పిలో నిర్వహించిన ఓ ర్యాలీలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు
టీఎంసీ కరోనా కంటే ప్రమాదకరమైందన్న దిలీప్ ఘోష్.. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వ్యాక్సిన్ వేసి దానిని నిర్మూలిస్తామన్నారు. టీఎంసీ లాంటి అప్రజాస్వామిక పార్టీని రాష్ట్రంలో ఇంతవరకు చూడలేదు. అధికార పార్టీ రోజులు లెక్కపెట్టుకుంటోంది. అయినప్పటికీ టీఎంసీ కార్యకర్తలు.. భాజపా కార్యకర్తలను భయపెడుతున్నార ని దిలీప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మరో నాలుగైదు నెలల్లో జరుగనున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే బీజేపీ సహా ఇతర ప్రతిపక్షపార్టీల కార్యకర్తలపై బనాయించిన తప్పుడు కేసులను కొట్టివేస్తామన్నారు. రాజకీయ ప్రత్యర్థులపై దారుణాలకు పాల్పడిన టీఎంసీ నేతలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
దిలీప్ ఘోష్ చేసిన వైరస్ వ్యాఖ్యాలపై స్పందించిన టీఎంసీ సెక్రటరీ జనరల్ పార్థ చటర్జీ…ఇలాంటి వ్యాఖ్యలు బీజేపీ మైండ్ సెట్ ని తెలియజేస్తున్నాయన్నారు. అలాంటి వ్యాఖ్యలపై తాము కామెంట్స్ చేయదల్చుకోలేదని వ్యాఖ్యానించారు. ఓటు రూపంలో బెంగాల్ ప్రజలు బీజేపీకి తగిన బుద్ధి చెబుతారని అన్నారు.