PM Narendra Modi : పాట్నా గురుద్వారాలో ప్రధాని ‘లంగర్’ సేవ.. స్వయంగా వండి భక్తులకు వడ్డించిన మోదీ!
ప్రధాని మోదీ తలపాగా వేషధారణలో స్టీల్ బకెట్ పట్టుకుని ఆహారాన్ని అక్కడి వారికి వడ్డించడం కనిపించింది. అంతేకాదు.. ఆయనే స్వయంగా రోటీ కూడా తయారుచేశారు.

PM Modi cooks, serves langar at Patna Sahib Gurdwara ( Image Credit : @narendramodi / Twitter
PM Narendra Modi : ప్రధాని నరేంద్ర మోదీ బీహార్ రాజధాని పాట్నాలోని ప్రసిద్ధ సాహిబ్ గురుద్వార్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన లంగర్‌లో తాను వండిన ఆహారాన్ని భక్తులకు వడ్డించారు. మోడీ ఆహారాన్ని వడ్డిస్తున్న ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Read Also : వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్‌ను చెంపదెబ్బ కొట్టిన ఓటరు.. ఆ తరువాత ఏం జరిగిందంటే?
ప్రధాని పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సిక్కుల ప్రార్థనా స్థలంలో ప్రధాని మోదీ తలపాగా వేషధారణలో స్టీల్ బకెట్ పట్టుకుని ఆహారాన్ని అక్కడి వారికి వడ్డించడం కనిపించింది. అంతేకాదు.. ఆయనే స్వయంగా రోటీ కూడా తయారుచేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది.
इतनी सुंदर और गोल रोटी तो महिलाये भी नहीं बनाती होगी…. मान गये मोदी जी आपको pic.twitter.com/0VZuMxMsi4
— Hardik Bhavsar (Modi Ka Parivar) (@Bitt2DA) May 13, 2024
తఖత్ పాట్నా సాహిబ్, తఖత్ హరిమందిర్ జీ.. పాట్నా సాహిబ్ అని కూడా పిలుస్తారు. రాష్ట్ర రాజధానిలో ఉన్న సిక్కుల ఐదు తఖత్‌లలో ఇదొకటి. గురుగోవింద్ సింగ్ జన్మస్థలం గుర్తుగా 18వ శతాబ్దంలో మహారాజా రంజిత్ సింగ్ ఈ తఖత్ నిర్మించారు. రాష్ట్ర రాజధానిలో రోడ్‌షో నిర్వహించిన ఒక రోజు తర్వాత ప్రధాని మోదీ హరిమందిర్ జీ పాట్నా సాహిబ్‌ను సందర్శించారు.
ऐसा सनातन का पुरोधा ढूंढने पर भी न मिलेगा
Proud of you My PM ? pic.twitter.com/nDAZWQKGqo
— Hardik Bhavsar (Modi Ka Parivar) (@Bitt2DA) May 13, 2024
బీహార్‌లో రోడ్‌షో నిర్వహించిన తొలి ప్రధాని మోదీనే. సోమవారం హాజీపూర్, ముజఫర్‌పూర్, సరన్‌లలో ఎన్‌డీఎ అభ్యర్థులకు అనుకూలంగా ఎన్నికల ర్యాలీలలో ప్రధాని ప్రసంగించనున్నారు. లోక్‌సభ ఎన్నికల 4వ దశ పోలింగ్ సందర్భంగా మోదీ ఈరోజు ఉదయం దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఎన్నికల పోలింగ్‌లో అధిక సంఖ్యలో ప్రజలు ఓటు వేయాలని కోరారు.
Sikhism is rooted in the principles of equality, justice and compassion. Central to Sikhism is Seva. This morning in Patna, I also had the honour of taking part in Seva as well. It was a very humbling and special experience. pic.twitter.com/0H8LufyzJ6
— Narendra Modi (@narendramodi) May 13, 2024
Read Also : హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు.. సీఎం రేవంత్ ఏమన్నారంటే..