ఫన్నీ వెడ్డింగ్ కార్డు: పెళ్లికి గిఫ్ట్‌లు వద్దు.. డబ్బులు ఇవ్వండి

ఫన్నీ వెడ్డింగ్ కార్డు: పెళ్లికి గిఫ్ట్‌లు వద్దు.. డబ్బులు ఇవ్వండి

Updated On : November 12, 2019 / 1:07 PM IST

నిజాయతీగా రాసిన కామెడీగా ఉన్న వెడ్డింగ్ కార్డు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. 2019 డిసెంబర్ 6న జరగాల్సి ఉన్న ఈ వెడ్డింగ్ కార్డు స్టైల్‌కు 3లక్షల మందికి పైగా చూశారు. సోషల్ మీడియాలో పోస్టు చేసిన మూడు పేజీల వెడ్డింగ్ కార్డు చదువుతున్నంతసేపు నవ్వు ఆగడం లేదు. కార్డును పాపులర్ కమెడియన్ అక్షర్ పఠాక్ రూపొందించారు. 

శర్మా జీ కా లడఖా తో వర్మ జీ కి లడకీ పెళ్లి జరగనుందని టైటిల్ తో ఇన్విటేషన్ పంపుతూనే ఈ పెళ్లికి ఓ ఫన్నీ హ్యాష్ ట్యాగ్‌(షా వర్మా)ను జతచేశాడు. అంతకంటే ముందు మేం ఇంత ఖర్చు పెట్టి ఎక్స్‌ట్రావాగంట్ కార్డు రూపొందించాం. మేం కూడా అంబానీ కంటే ఏం తక్కువ కాదు. అని రాస్తూనే వేదిక గురించి హాస్యాస్పదంగా కామెంట్ చేశాడు. 

కార్డు మొత్తం అయిపోయిన తర్వాత చివర్లో గిఫ్ట్‌లు ఏం ఇవ్వొద్దు, కేవలం డబ్బు మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే 18 జ్యూసర్ మిక్సర్ గ్రైండర్ లతో మేమేం చేసుకుంటాం. అని పోస్టు చేశాడు. చివర్లో ఆ రెస్టారెంట్ కు దారి ఇదని రాసి దీనిని నమ్ముకోవద్దు. దారిలో ఎవరైనా కనిపిస్తే వాళ్లని అడగండి అంటూ తయారుచేశారు. 

ఇది నెట్టింట్లో పిచ్చ వైరల్ అయ్యి కూర్చొంది. కొందరేమో ఇంకా ఫన్నీగా రూపొందించ వచ్చంటూ అమ్రిష్ పురి, ఆవో ఆవో, దిల్వాలే దుల్హానియే లే జాయేంగే అనే టైటిళ్లతో మెనూలో ఫుడ్ కూడా ముందే చెప్పాల్సిందని సలహాలిస్తున్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

An honest #wedding card. Please #RSVP

A post shared by Akshar Pathak (@aksharpathak) on