అమరావతికి ’జమ్మలమడుగు’ పంచాయతీ

’వచ్చే అసెంబ్లీకి నేనంటే నేనంటూ మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి’ పోటీ పడుతున్నారు.

  • Published By: veegamteam ,Published On : January 23, 2019 / 12:18 PM IST
అమరావతికి ’జమ్మలమడుగు’ పంచాయతీ

Updated On : January 23, 2019 / 12:18 PM IST

’వచ్చే అసెంబ్లీకి నేనంటే నేనంటూ మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి’ పోటీ పడుతున్నారు.

కడప : జమ్మలమడుగు పంచాయతీ అమరావతికి చేరింది. జమ్మలమడుగు నియోజకవర్గ పంచాయతీ సీఎం చంద్రబాబు చెంతకు చేరింది. ’వచ్చే అసెంబ్లీకి నేనంటే నేనంటూ మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి’ పోటీ పడుతున్నారు. కొంతకాలంగా దీనిపై జమ్మలమడుగు నియోజకవర్గంలో రచ్చ జరుగుతూనే ఉంది. ఇరువురి నేతల మధ్య ఆధిపత్య పోరు మరింత ముదరడంతో చంద్రబాబు రంగంలోకి దిగారు. అమరావతిలో చంద్రబాబుతో ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి భేటీ అయ్యారు. పట్టుదలకు ఇరువురు నేతలు పోకుండా జమ్మలమడుగు అభివృద్ధికి కృషి చేయాలని చంద్రబాబు హెచ్చరించారు.

ఇద్దరిలో ఒకరిని పార్లమెంట్ కు, మరొకరిని అసెంబ్లీకి పంపాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఎవరు దేనికి పోటీ చేస్తారో చర్చించుకుని రావాలని చెప్పడంతో ఇరువురు నేతలు మరోసారి చంద్రబాబుతో భేటీ కానున్నారు. ఎవరికి ఏ బాధ్యత అప్పగించినా కలిసి పని చేస్తామని చంద్రబాబుకు చెప్పినట్లుగా ఇరువురు నేతలు ప్రకటించారు.