స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలు చేస్తే తాట తీస్తాం..

ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్నినాని తెలిపారు.

  • Published By: veegamteam ,Published On : February 12, 2020 / 07:55 AM IST
స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలు చేస్తే తాట తీస్తాం..

Updated On : February 12, 2020 / 7:55 AM IST

ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్నినాని తెలిపారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్నినాని తెలిపారు. అక్రమాలకు పాల్పడ్డ అభ్యర్థులపై అనర్హత వేటుతోపాటు 3 సంవత్సరాలు శిక్ష కూడా ఉంటుందని హెచ్చరించారు. మార్చి 15లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్ణయించినట్లు తెలిపారు. పారిశుద్ధ్యం, పచ్చదనం బాధ్యతలు సర్పంచ్ లకు అప్పగించినట్లు తెలిపారు. సర్పంచ్ లు స్థానికంగానే ఉండాలనే నిబంధనల పెట్టినట్లు చెప్పారు. ఏపీ కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియాకు కేబినెట్ నిర్ణయాలను వివరించారు. ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేపట్టినా, మద్యం పంచినా, కులం ప్రస్తావన తెచ్చినా చర్యలు తప్పవని హెచ్చరించారు.

కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు
బుధవారం (ఫివ్రబరి 12, 2020) ఏపీ కేబినెట్ భేటీ దాదాపు గంటన్నరసేపు సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. సీపీఎస్ రద్దు, ర్యాలీపై నమోదైన పలు కేసులను ఎత్తివేయాలన్న ప్రతిపాదనలతోపాటు మున్సిపల్ ఎన్నికలు ప్రక్రియను 20 రోజులకు కుదించే ప్రతిపాదనపై కేబినెట్ చర్చించింది. జగనన్న విద్యా కానుక కింద బ్యాగ్, యూనిఫామ్, బూట్లు, నోట్ పుస్తకాలు ఇవ్వాలనే అంశంపై కూడా చర్చించారు. ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ఏర్పాటు చేసే అంశం కూడా చర్చకు వచ్చింది. ఏపీ స్టేట్ అగ్రికల్చరల్ కౌన్సిల్ ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. మార్చి 15లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్ణయించాలని కేబినెట్ నిర్ణయించింది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు పెట్టాలని నిర్ణయించారు.

జగన్ ప్రభుత్వం విప్లవతాక్మక నిర్ణయాలు
జగన్ ప్రభుత్వం సమాజంలోని పేదల సంక్షేమ పట్టం మాత్రమే విప్లవతాక్మక నిర్ణయాలు తీసుకోవడం కాకుండా పేదవాడికి ఆంగ్ల మాద్యమంలో విద్య, ప్రతి పేదవాడికి ఇంటి స్థలం…లాంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుందని పేర్ని నాని తెలిపారు. ఇందులో భాగంగానే పంచాయతీ రాజ్ చట్టంలోని ఎన్నికల ప్రక్రియలో కూడా దేశంలోని అన్ని రాష్ట్రాలు ఏపీ వైపు చూసేలా మరో విప్లవాత్మక నిర్ణయాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు.

ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే జైలు శిక్ష
ఇప్పటివరకు వరకు పంచాయతీ ఎన్నికలు లేదా మున్సిపల్ ఎన్నికల్లో ఎవరైనా ఎన్నికల నియమావలికి విరుద్దంగా అక్రమాలకు పాల్పడితే గరిష్టంగా మూడు నుంచి ఆరు మాసాలు శిక్ష మాత్రమే ఉండేదన్నారు. స్థానిక ఎన్నికల్లో గ్రామ స్థాయి నుంచి సంస్కరణలు తీసుకురావాలని ఉద్దేశంతో ఏదైనా ఎన్నికల నియమావళికి విరుద్ధంగా అవినీతి, అక్రమాలకు పాల్పడితే ఆధారాలతో దొరకితే… సదరు అభ్యర్థులపై అనర్హత వేటు వేయబడుతుందన్నారు. అనర్హత వేటు వేయడమే కాకుండా మూడు సంవత్సరాల శిక్ష ఉంటుందన్నారు. 

స్థానిక ఎన్నికలకు 13 నుంచి 15 రోజులు గడువు
ఎన్నికల్లో ధన ప్రభావాన్ని, అక్రమాలను తగ్గించడం కోసం పంచాయతీ ఎన్నికల మొత్తాన్ని 13 నుంచి 15 రోజులు ఎంపీటీసీ, జెడ్ పీటీసీలకు 15 రోజులు, సర్పంచ్ ఎన్నికలకు 13 రోజులు ఉంటుందని తెలిపారు. నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు మొత్తం ప్రక్రియ 15 రోజుల్లో పూర్తి అయ్యే విధంగా చట్టంలో మార్పు చేసినట్లు తెలిపారు. పంచాయతీ ఎన్నికలు ప్రచారం.. 5 రోజులు, ఎంపీటీసీ, జెడ్ పీటీసీ ఎన్నికల ప్రచారానికి 7 రోజులు ప్రచారం సమయం ఉండేలా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. 

గిరిజన ప్రాంతాల్లో అక్కడి వారికే జెడ్ పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్ పదవులు
గిరిజన ప్రాంతాలుగా గెజిట్ చేయబడి, నోటిఫై చేయబడిన ప్రాంతాలన్నింటిలో అక్కడ జెడ్ పీటీసీ, ఎంపీపీ, పంచాయతీ సర్పంచ్ గిరిజనులకే రిజర్వు చేస్తూ నిర్ణయించాం. 
ఎంపీటీసీ, వార్డుల మెంబర్లు గానీ అగ్రవర్ణాలతోపాటు అన్ని కులాలు ఉండవచ్చు. పరిపాలన వికేంద్రీకరణ పాలనలో భాగంగా పారిశుద్ద్యం, పచ్చదనం రెండింటిని సర్పంచ్ కు అప్పగిస్తూ.. అందుకే సర్పంచ్ స్థానికంగా నివాసముండేలా నియమం పెట్టడం జరుగుతుంది.

ప్రజలకు అందుబాటులో సర్పంచులు 
ఎన్నిక కాబడిన సర్పంచ్ ప్రజలకు అందుబాటులో ఉండి పరిపాలన సాగించాలి. ప్రతి రోజు సర్పంచ్ పంచాయతీ ఆఫీస్ కు వచ్చి కార్యకలాపాలు నిర్వహించాలని విధులను తప్పనిసరి చేశాం.  మున్సిపల్ ఎన్నికల్లో కూడా పంచాయతీ ఎన్నికల నియమావళి వర్తిస్తుంది. అభ్యర్థి ఎన్నిక తర్వాత అయినా నేరం రుజువు అయితే అతన్ని అనర్హుడుగా ప్రకటిస్తాం. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ…నోటిఫికేషన్ నుంచి పోలింగ్ వరకు 15 రోజులకు తగ్గిస్తూ తీర్మానం చేసినట్లు… మంత్రి పేర్ని నాని తెలిపారు.