ఏపీ కేబినెట్.. కీలక నిర్ణయాలు ఇవే

ఏపీ సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సమూల సంస్కరణలు తీసుకురావాలని ప్రతిపాదించింది.

  • Published By: veegamteam ,Published On : February 13, 2020 / 02:07 AM IST
ఏపీ కేబినెట్.. కీలక నిర్ణయాలు ఇవే

Updated On : February 13, 2020 / 2:07 AM IST

ఏపీ సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సమూల సంస్కరణలు తీసుకురావాలని ప్రతిపాదించింది.

ఏపీ సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సమూల సంస్కరణలు తీసుకురావాలని ప్రతిపాదించింది. నోటిఫికేషన్‌ జారీ నుంచి పదిహేను రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తిచేసే విధంగా పంచాయతీ రాజ్, మున్సిపల్‌ చట్టాలను సవరించాలని నిర్ణయించింది. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారానికి ఐదు రోజు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారానికి ఏడు రోజులు గడువు నిర్దేశించింది. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినట్టు తేలితే ప్రస్తుతం ఉన్న చట్ట నిబంధనల ప్రకారం మూడు నెలల నుంచి ఆరు నెలల శిక్ష ఉంది. దీనిని మూడు సంవత్సరాలకు పెంచుతూ కేబినెట్‌ తీర్మానించింది. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రవర్తించినట్టు రుజువైతే శిక్షతోపాటు అనర్హత వేటు పడుతుంది. 

షెడ్యూల్డ్‌ ఏరియాల్లో సర్పంచ్‌, ఎంపీపీ, జెడ్పీ చైర్‌పర్సన్‌ పదవులు ఎస్టీలకే 
ఎన్నికైన సర్పంచ్‌ స్థానికంగా నివాసం ఉండాలన్న నిబంధనను ప్రభుత్వం తీసుకొచ్చింది. షెడ్యూల్డ్‌ ఏరియాల్లో సర్పంచ్‌, మండల ప్రజాపరిషత్‌ అధ్యక్షుడు, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పోస్టులను తప్పనిసరిగా ఎస్టీలకు రిజర్వు చేస్తూ చట్టాలను సవరించాలని కేబినెట్ తీర్మానించింది.  గ్రామాల్లో పచ్చదనం పెంచడం, పారిశుధ్యం మెరుగుపరచడం, మంచినీటి ఎద్దడి నివారణ వంటి కీలక బాధ్యతలను సర్పంచ్‌లకు అప్పగిస్తూ తీర్మానం చేసింది. 

జగనన్న విద్యా కానుక పథకం అమలు
జగనన్న విద్యా కానుక పథకం అమలుపై కూడా కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేసే ఈపథకం ద్వారా 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు మూడు జతల యూనిఫారాలు, రెండు జతల బూట్లు, సాక్స్‌, పుస్తకాలతో కూడిన కిట్‌ బ్యాగ్‌ అందించాలని తీర్మానించింది. అలాగే రాష్ట్ర వ్యవసాయ మండలి ఏర్పాటు ముసాయిదా బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. విద్యుత్‌ సమస్యను అధిగమించేందుకు వీలుగా  పదివేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్‌ కేంద్రం ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. రైతుల ఉచిత విద్యుత్‌కు 8 వేల కోట్ల రూపాయలు కేటాయించింది. లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకాల పదిహేను వందల కోట్ల సబ్సిడీ చెల్లించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.