మోడీపై దీక్షాస్త్రం : హస్తినలో బాబు ఒక్క రోజు దీక్ష

అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీపై ఏపీ సీఎం ద్రబాబు దీక్షాస్త్రం సంధించబోతున్నారు. ఏపీకి జరిగిన అన్యాయంపై ఢిల్లిలోనే ఒకరోజు నిరసన చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం

  • Published By: veegamteam ,Published On : January 27, 2019 / 03:49 AM IST
మోడీపై దీక్షాస్త్రం : హస్తినలో బాబు ఒక్క రోజు దీక్ష

అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీపై ఏపీ సీఎం ద్రబాబు దీక్షాస్త్రం సంధించబోతున్నారు. ఏపీకి జరిగిన అన్యాయంపై ఢిల్లిలోనే ఒకరోజు నిరసన చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం

అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీపై ఏపీ సీఎం ద్రబాబు దీక్షాస్త్రం సంధించబోతున్నారు. ఏపీకి జరిగిన అన్యాయంపై ఢిల్లిలోనే ఒకరోజు నిరసన చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం ప్రణాళికలు రూపొందిస్తున్నారు. తన దీక్షతో మోడీపై మరింత ఒత్తిడి తీసుకురావడంతోపాటు… బీజేపీయేతర పక్షాలన్నింటినీ ఏకం చేయవచ్చనేది చంద్రబాబు ఆలోచన.

 

* పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ
* ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం
* కేంద్రం ఫుల్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టడంపై ఆగ్రహం
* ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని డిమాండ్‌
* కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఎంపీలకు దిశానిర్దేశం
* ఈవీఎంలపై పోరాటం ఉధృతం చేయాలని సూచన

టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఉండవల్లి ప్రజా వేదికలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. 2019, జనవరి 31వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంట్‌ చివరి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబు పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ప్రధాని మోడీ ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ ప్రవేశపెట్టకుండా ఫుల్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని చూస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.  ప్రజాస్వామ్యంలో చివరి బడ్జెట్‌ సమయంలో ఫుల్‌ బడ్జెట్‌ పెట్టడం సరైన విధానం కాదన్నారు. పుల్ బడ్జెట్ పెట్టకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టేలా టీడీపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని చంద్రబాబు ఆదేశించారు. అంతేకాదు.. ఈవీఎంలపైనా పోరాటాన్ని ఉధృతం చేయాలని ఎంపీలకు సూచించారు. చివరి సమావేశాలు కావడంతో సస్పెండ్ కాకుండా సభలోనే ఉండి ఏపీ హక్కులపై కేంద్రాన్ని నిలదీయాలని ఎంపీలకు సూచించారు. ఎప్పటికప్పుడు బీజేపీయేతర పక్షాలతో కూడా సమన్వయం చేసుకుంటూ ముందకు సాగాలని చెప్పారు.

 

* పార్లమెంట్‌ చివరి సమావేశాల్లో వ్యూహాత్మకంగా అడుగులు
* పార్లమెంట్‌ సమావేశాలకు ముందురోజు హస్తినకు చంద్రబాబు
* బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగితే ఆందోళనకు రెడీ
* ఒకరోజు దీక్ష చేపట్టాలని యోచన
* దీక్షతో మోడీపై ఒత్తిడి పెంచే వ్యూహం

పార్లమెంటుకు చివరి సమావేశాలు కావడంతో వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని ఎంపీలకు చంద్రబాబు డైరెక్షన్స్ ఇచ్చారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యే రోజు లేదా ముందురోజు తాను ఢిల్లీకి వస్తానని చెప్పారు. ఢిల్లీలో బీజేపీయేతర పక్షాలందరితో కలిసి ఏపీకి జరిగిన అన్యాయంపై కేంద్ర సర్కార్‌పై ఒత్తిడి తీసుకువచ్చేందుకు కృషి చేద్దామని చెప్పారు. బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగితే చివరి రోజున హస్తినలో ఒకరోజు నిరసన దీక్ష చేపట్టేలా చంద్రబాబు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ అంశంపై ఎంపీల అభిప్రాయం కోరగా.. వారంతా నిరసన దీక్ష చేయడం సబబేనని చెప్పారు. దీంతో సమయానుకూలంగా వ్యవహరిద్దామని చంద్రబాబు తెలిపారు. హస్తిన వేదికగా నిరసన దీక్ష చేపడితే మోడీపై మరింత ఒత్తిడి పెరుగుతుందన్నది చంద్రబాబు ఆలోచన. గతంలో రాష్ట్రానికి సమ న్యాయం చేయాలని చంద్రబాబు హస్తిన వేదికగా నిరాహారదీక్ష చేపట్టారు. ఇప్పుడు మరోసారి ఏపీకి కేంద్రం చేసిన అన్యాయంపై నిరసన దీక్షకు రెడీ అవుతున్నారు.