Balka Suman : దమ్ముంటే.. రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికలకు వెళ్ళాలి- బాల్క సుమన్ సవాల్

మీ ప్రభుత్వాన్ని పడేసే అవసరం మాకు లేదు. మీ ప్రభుత్వంలోనే ఎంతోమంది గుంపు మేస్త్రీలు ఉన్నారు.

Balka Suman : దమ్ముంటే.. రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికలకు వెళ్ళాలి- బాల్క సుమన్ సవాల్

Balka Suman

Balka Suman : కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ నేత బాల్క సుమన్. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ ను సవాల్ చేసే అర్హత లేదన్నారు. మీకు దమ్ముంటే.. రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు బాల్క సుమన్. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే దమ్ముందా? అని నిలదీశారు. రాష్ట్రాన్ని విధ్వంసం వైపు నడిపిస్తున్నారు అని ముఖ్యమంత్రి రేవంత్ పై విరుచుకుపడ్డారు బాల్క సుమన్. అందుకే.. మేడిగడ్డకు మరమ్మత్తు చేయకుండా సర్కార్ జాప్యం చేస్తోందని ఆరోపించారు.

”మిషన్ భగీరథ పనికి రాదని ఓ ఎమ్మెల్యే అంటారు. 6 గ్యారంటీలపై తప్పుదోవ పట్టించేందుకు సీఎం రేవంత్ బూతు పురాణం అందుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ది నోరా? మొరా? మీ ప్రభుత్వాన్ని పడేసే అవసరం మాకు లేదు. మీ ప్రభుత్వంలోనే ఎంతోమంది గుంపు మేస్త్రీలు ఉన్నారు. రైతుబంధు నిధులు రాఘవ కన్ స్ట్రక్షన్ కు మళ్లించ లేదా? మీ ప్రభుత్వం విడుదల చేసిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా? మేడిగడ్డ మరమ్మతులు వెంటనే చేయాలి. లేదంటే మేము కుట్రగా భావిస్తాం. సీఎం రేవంత్ తన భాష మార్చుకోవాలి. రాష్ట్రంలో అప్పుడే కరెంట్ కష్టాలు, తాగునీటి సమస్యలు మొదలయ్యాయి. లబ్ధిదారుల ఎంపికకు నిబంధనలు పెట్టకుండా సబ్సిడీ గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి పథకాలను అర్హులందరికీ ఇవ్వాలి” అని రేవంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బాల్క సుమన్.

Also Read : దమ్ముంటే.. ఒక్క సీటు గెలిచి చూపించు- కేటీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్