విశాఖ నార్త్ నుండి పోటీ చేయడం లేదు- గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు

జగన్ సినిమా అయిపోయింది. వైసీపీ ఎక్స్ పైరీ డేట్ కు వచ్చింది. టీడీపీ-జనసేన పొత్తు సూపర్ డూపర్ సక్సెస్ అవుతుంది.

విశాఖ నార్త్ నుండి పోటీ చేయడం లేదు- గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు

Ganta Srinivasa Rao

Updated On : February 16, 2024 / 6:23 PM IST

Ganta Srinivasa Rao : టీడీపీ నేత, మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేసే స్థానంపై ఆయన ఓపెన్ అయ్యారు. ఈ ఎన్నికల్లో నేను విశాఖ నార్త్ నియోజకవర్గం నుండి పోటీ చేయడం లేదని గంటా తేల్చి చెప్పారు. గతంలో గెలిచిన నియోజకవర్గం నుండే పోటీ చేస్తాను అని అన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో టీడీపీకి కొత్త ఇంఛార్జ్ రాబోతున్నారని గంటా శ్రీనివాసరావు వెల్లడించారు.

Also Read : సొంత జిల్లాలో బొత్సకు షాక్? వైసీపీకి దూరమవుతున్న ప్రధాన అనుచరులు..!

”శంఖారావం షెడ్యూల్ స్వల్పంగా మారింది. ఈ నెల 19న నార్త్ నియోజకవర్గంలో శంఖారావం జరుగుతుంది. సీఎం జగన్ టూర్ కారణంగా పోలీసులు అనుమతి వాయిదా వేశారు. రాజధాని ఫైల్స్ సినిమా వాస్తవ పరిస్థితికి నిలువెత్తు అద్దం. అమరావతి రైతుల కష్టాలు, పోరాటం. సినిమా విడుదలైతే జగన్ దాష్టీకం బయటకు వస్తుందనే అడ్డుకున్నారు. కోర్టు అనుమతితో ఎట్టకేలకు సినిమా రిలీజ్ అయ్యింది. సీఎం అయ్యాక రాజధాని విషయంలో మాట తప్పారు. విశాఖలో రాజధాని కోసం ఒక్క ఇటుక బెడ్డ వెయ్యలేదు.

Also Read : పిఠాపురం సీటు ఎందుకంత హాటు? గెలుపుపై పార్టీల ధీమా వెనుక కారణమేంటి

కానీ, జగన్ ఉండేందుకు రుషికొండపై 500 కోట్లతో ప్యాలస్ నిర్మించుకున్నారు. ఉమ్మడి రాజధానిగా మరో పదేళ్లు హైదరాబాద్ ఉండాలని వైవీ సుబ్బారెడ్డి అనడం దారుణం. జగన్ సినిమా అయిపోయింది. వైసీపీ ఎక్స్ పైరీ డేట్ కు వచ్చింది. టీడీపీ-జనసేన పొత్తు సూపర్ డూపర్ సక్సెస్ అవుతుంది. అధికారం కోసం వాలంటీర్లను జగన్ రెచ్చగొడుతున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలో ఏ సీటు గెలుస్తారో వైసీపీకి స్పష్టత లేదు. బీజేపీతో పొత్తు ఉంటుందని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను” అని గంటా శ్రీనివాసరావు తెలిపారు.