మహిళా కండక్టర్లకు నైట్ డ్యూటీలు వద్దు – కేసీఆర్

  • Published By: madhu ,Published On : December 1, 2019 / 12:48 PM IST
మహిళా కండక్టర్లకు నైట్ డ్యూటీలు వద్దు  – కేసీఆర్

Updated On : December 1, 2019 / 12:48 PM IST

ఆర్టీసీ మహిళా కండక్టర్లకు నైట్ డ్యూటీలు వేయవద్దని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సమయంలో మగ కండక్టర్లు..డ్యూటీ అదనంగా చేసుకొనే ఆలోచన చేయాలన్నారు. మహిళా కండక్టర్లకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. సంస్థ బాగు కోసం పనిచేయాలన్నారు. డిసెంబర్ 01వ తేదీ సోమవారం ఆర్టీసీ కార్మికులతో లంచ్ చేసిన సీఎం కేసీఆర్..వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

మహిళా ఉద్యోగుల సంఖ్య చాలా తక్కువగా ఉందని, మహిళా కండక్టర్లు సాయంత్రం 07.30 నుంచి రాత్రి 8.00 గంటలోపు విధులు ముగించుకొనే విధంగా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలిపారు. ఇక ప్రసూతి లీవ్ ఆరు నెలలు ఉంటుందని..ఎన్ని లీవులు అవసరం ఉంటుందో అవసరమైన లీవ్స్ తీసుకొనే ఛాన్స్ ఉందని..ఇందుకు అధికారులు ఆదేశాలు జారీ చేయాలన్నారు.

మహిళ టాయిలెట్ విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని, డ్రెస్ ఛేంజ్ సౌకర్యం కూడా వెంటనే నిర్ణయం తీసుకుని అమల్లోకి తేవాలని సూచించారు. ఆర్టీసీని బాగు పడాలంటే కార్మికులే చేసుకోవాల్సిన అవసరం ఉందని, ఇందులో ఆర్టీసీ అధికారుల పాత్ర కూడా ఉంటుందన్నారు. ఖాకీ డ్రెస్ వేయవద్దని..ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో..మహిళా కమిటీ నిర్వహిస్తుందని..నాలుగైదు రోజుల్లో ఓ నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. ఆర్టీసీలో ఎవరు ఉద్యోగాలు పోవని, ఒక్క కార్మికుడి కూడా తొలగించమన్నారు. ఉద్యోగ భద్రత ఉన్న తర్వాత..మంచిగా పనిచేయొచ్చన్నారు సీఎం కేసీఆర్. 
Read More : ఆర్టీసీ కార్మికులతో కేసీఆర్ : చనిపోయిన కుటుంబసభ్యులకు రూ. 2 లక్షలు