చంద్రబాబు ఆగ్రహం : అధికారం ఇచ్చింది పగ తీర్చుకోవటానికా!

  • Published By: chvmurthy ,Published On : September 6, 2019 / 12:36 PM IST
చంద్రబాబు ఆగ్రహం : అధికారం ఇచ్చింది పగ తీర్చుకోవటానికా!

Updated On : September 6, 2019 / 12:36 PM IST

తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలోఇలాంటి రాక్షస పాలన ఎన్నడూ చూడలేదని..జగన్ కక్ష పూరిత రాజకీయాలకు శ్రీకారం చుట్టారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఫ్యాక్షన్ జిల్లాల నుంచి వచ్చిన సీఎంలు రాజశేఖర్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డిలు కూడా ఫ్యాక్షన్ ని వారి జిల్లాలకే పరిమితం చేసి రాష్ట్రంలో హుందాగా వ్యవహరించేవారని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజలు ఓట్లు వేసి గెలిపించింది పగ తీర్చుకోడానికా అని చంద్రబాబు సీఎం జగన్ ను ప్రశ్నించారు.

అసెంబ్లీలో నేను ఏ రోజు మైకు కోసం పోరాడలేదని.. ఇప్పుడు మైకు కోసం పోరాడే పరిస్ధితి వచ్చిందని అసహనం వ్యక్తం చేశారాయన. తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ వారిపై దాడి చేసి వారిపైనే తిరిగి నాన్ బెయిల్ బుల్ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కిందిస్ధాయి పోలీసుల్లో అత్యుత్సాహం ఎక్కువయ్యిందని..  పోలీసులపై ప్రజలకు నమ్మకం కోల్పోయే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు.

రాష్ట్రంలో వైసీపీకి కేడర్ లేదని, టీడీపీ కేడర్ ను ధ్వంసం చేయాలని చూస్తున్నారని సంచలన విమర్శలు చేశారు చంద్రబాబు. నాపై కేసులు పెట్టడం,  దాడులు చేయడం, సెక్యూరిటీ తగ్గించి నీచమైన రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బాబు. జగన్ పాదయాత్ర కు పూర్తి స్థాయి సెక్యూరిటీ ఇచ్చామని… వరదలు వస్తే నా ఇళ్లు ముంచి రాజకీయాలు చేసి అప్రదిష్ట పాలయ్యారని అన్నారు. ప్రజలు తమ ఇంట్లో తాము ఉండేందకు పోరాట చేయాల్సిన రోజులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు.