విశాఖ వద్దు.. బెంగళూరు ముద్దు : రాజధానిపై టీడీపీ నేత కొత్త డిమాండ్
ఏపీలో మూడు రాజధానుల అంశం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. రాజధాని మార్పుపై అటు ప్రజల్లో ఇటు రాజకీయవర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఏపీలో మూడు రాజధానుల అంశం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. రాజధాని మార్పుపై అటు ప్రజల్లో ఇటు రాజకీయవర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీలో మూడు రాజధానుల అంశం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. రాజధాని మార్పుపై అటు ప్రజల్లో ఇటు రాజకీయవర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజధాని మార్పు నిర్ణయాన్ని కొందరు సమర్థిస్తే.. కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఎవరికి తోచినట్టుగా వారు చెబుతున్నారు. తాజాగా టీడీపీ నేత కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు. మాకు విశాఖ రాజధాని వద్దు.. బెంగళూరు రాజధాని ముద్దు అంటున్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ తిక్కారెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
ఆయన సరికొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. కర్నూలు పార్లమెంటును కర్నాటకలో కలపాలని తిక్కారెడ్డి డిమాండ్ చేశారు. ఒకప్పుడు మేము బళ్లారి జిల్లా వాసులం అని గుర్తు చేసిన తిక్కారెడ్డి.. కర్నూలును బళ్లారిలో చేర్చాలన్నారు. సీఎంలు మారినప్పుడల్లా రాజధాని మార్చితే ఎలా అని తిక్కారెడ్డి ప్రశ్నించారు. మంత్రి బొత్స సత్యనారాయణ సీఎం అయితే.. శ్రీకాకుళంను రాజధాని చేయాలని అంటారేమో అని సందేహం వ్యక్తం చేశారు. అదే కనుక జరిగితే మేము ఒడిశాకు వెళ్లాలా అని తిక్కారెడ్డి నిలదీశారు.
విశాఖలో రాజధాని ఏర్పాటు చేస్తే రాయలసీమ వాసులు తీవ్ర ఇబ్బందులు పడతారని తిక్కారెడ్డి వాపోయారు. విశాఖకు వెళ్లాలంటే 2 రోజుల సమయం పడుతుందన్నారు. సీమ ప్రాంత ప్రజలకు ఇదంతా ఖర్చుతో కూడుకున్న పని అని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, కర్నూలుని కర్నాకటలో కలిపి.. బెంగళూరు రాజధానిగా చేయాలని తిక్కారెడ్డి తీసుకొచ్చిన కొత్త ప్రతిపాదన టీడీపీ వర్గాల్లో చర్చకు దారితీసింది. అసలే మూడు రాజధానుల అంశం టీడీపీలో విబేధాలకు దారితీసింది. రాజధాని మార్పుని చంద్రబాబు వ్యతిరేకిస్తుంటే.. విశాఖ టీడీపీ నేతలు మాత్రం వెల్ కమ్ చెబుతున్నారు. అంతేకాదు.. తమ ప్రాంత అభివృద్ది కోసం టీడీపీని వీడేందుకు కూడా రెడీ అంటున్నారు. ఈ చిక్కులు చాలవన్నట్టు ఇప్పుడు కర్నూలు టీడీపీ నేత చంద్రబాబుకి మరో సమస్యని తెచ్చిపెట్టారు అని తమ్ముళ్లు అనుకుంటున్నారు.
Also Read : 3 రాజధానులు మంచిదే : రాజధానితో 10శాతం మంది ప్రజలకే పని