టార్గెట్ 10.. లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ ఫోకస్, రంగంలోకి అమిత్ షా

కరీంనగర్ లో మధ్యాహ్నం ఒంటి గంటకు కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ బూత్ స్థాయి కార్యకర్తలతో అమిత్ షా సమావేశం అవుతారు.

టార్గెట్ 10.. లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ ఫోకస్, రంగంలోకి అమిత్ షా

BJP Focus On Lok Sabha Elections 2024

Updated On : January 26, 2024 / 9:56 PM IST

Lok Sabha Elections 2024 : లోక్ సభ ఎన్నికలపై కమలం పార్టీ సీరియస్ గా ఫోకస్ పెట్టింది. 35శాతం ఓట్లతో పాటు 10 ఎంపీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం బీజేపీ అగ్రనేత అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. ఆదివారం ఉదయం 11.30 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేటకు అమిత్ షా చేరుకుంటారు. అక్కడి నుంచి కరీంనగర్ కు హెలికాప్టర్ లో వెళ్తారు. కరీంనగర్ లో మధ్యాహ్నం ఒంటి గంటకు కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ బూత్ స్థాయి కార్యకర్తలతో అమిత్ షా సమావేశం అవుతారు.

Also Read : లోక్‌సభ ఎన్నికలకు కేసీఆర్ సరికొత్త వ్యూహం.. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు వీళ్లేనా?

అనంతరం కరీంనగర్ నుంచి హెలికాప్టర్ లో మహబూబ్ నగర్ కు అమిత్ షా చేరుకుంటారు. అక్కడ మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ పార్లమెంటు నియోజకవర్గాల ఆఫీస్ బేరర్స్ తో ఆయన సమావేశం అవుతారు. మహబూబ్ నగర్ లో సమావేశం తర్వాత అమిత్ షా హైదరాబాద్ చేరుకుంటారు. ఫిలింనగర్ జేఆర్సీ కన్వెన్షన్ లో జరిగే మహిళా సమ్మేళనంలో ఆయన పాల్గొంటారు. 2వేల మందితో మహిళా సమ్మేళనం జరిపేందుకు తెలంగాణ బీజేపీ ప్లాన్ చేస్తోంది.