3 రాజధానులు : మండలిలో ఏం జరగనుంది.. టీడీపీ, వైసీపీ బలాబలాలు
ఇవాళ్టి(జనవరి 21,2020) నుంచి ఏపీ శాసనమండలి ప్రారంభం కానుంది. శాసనసభ కంటే ఒక రోజు ఆలస్యంగా ప్రారంభమవుతున్న మండలి సమావేశాలు రెండు రోజులపాటు

ఇవాళ్టి(జనవరి 21,2020) నుంచి ఏపీ శాసనమండలి ప్రారంభం కానుంది. శాసనసభ కంటే ఒక రోజు ఆలస్యంగా ప్రారంభమవుతున్న మండలి సమావేశాలు రెండు రోజులపాటు
ఇవాళ్టి(జనవరి 21,2020) నుంచి ఏపీ శాసనమండలి ప్రారంభం కానుంది. శాసనసభ కంటే ఒక రోజు ఆలస్యంగా ప్రారంభమవుతున్న మండలి సమావేశాలు రెండు రోజులపాటు కొనసాగనున్నాయి. శాసనసభలో ఆమోదం పొందిన 3 రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులను ప్రభుత్వం శాసనమండలిలో ప్రవేశపెట్టనుంది. ఈ రెండు బిల్లులు మండలిలో ఆమోదం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేయనుంది.
వైసీపీకి కత్తిమీద సామే:
ఇవాళ్టి నుంచి ఏపీ శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు మండలి ప్రారంభం కానుంది. శాసనసభలో ఆమోదం పొందిన రెండు బిల్లులను ప్రభుత్వం శాసన మండలిలో ప్రవేశపెట్టనుంది. అయితే.. శాసనమండలిలో బలం తక్కువగా ఉన్న ప్రభుత్వానికి.. ఈ బిల్లుల్ని పాస్ చేయించుకోవడం కత్తిమీద సాములా మారింది. శాసనమండలిలో ఈ బిల్లులపై తమ అభిప్రాయాన్ని గట్టిగా వినిపించాలని టీడీపీ భావిస్తోంది. నిన్న(జనవరి 20,2020) అసెంబ్లీలో శక్తి మేరకు ఈ బిల్లులపై చర్చ చేసిన టీడీపీ, ఇవాళ(మంగళవారం) మండలిలో కూడా గట్టిగా వ్యతిరేకించాలని నిర్ణయించింది.
టీడీపీ బలం 32, వైసీపీ బలం 9:
మండలిలో వైసీపీ సభ్యుల బలం 9 మంది మాత్రమే. గవర్నర్ కోటాలో నామినేట్ అయిన కంతేటి సత్యనారాయణ రాజు ఎలాగో వైసీపీలోనే ఉన్నారు కాబట్టి అదనంగా మరో సభ్యుడు కలిసివస్తారు. దీంతో ప్రభుత్వ బలం 10గా ఉంటుంది. కానీ టీడీపీకి మండలిలో సభ్యుల బలం ఏకంగా 34 ఉంది. (టీడీపీకి 28మంది సభ్యులతోపాటు.. నామినేటెడ్ సభ్యుల్లోని ఐదుగురు ఎమ్మెల్సీలు, ఇండిపెండెంట్లలోని ఓ ఎమ్మెల్సీ టీడీపీకి మద్దతిస్తున్నారు. దీంతో మొత్తంగా ఆ పార్టీ బలం 34గా ఉంది.)
ఈ క్రమంలో బిల్లు ఆమోదం పొందుతుందా అన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే ప్రభుత్వానికి కలిసివచ్చే అంశం ఏమిటంటే టీచర్స్ ఎమ్మెల్సీలు ఐదుగురు ఉన్నారు. వారికి పార్టీలతో సంబంధం లేదు. పైగా వీరిలో ఒక్కరు కూడా మూడు రాజధానులకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. అలా అని అనుకూలంగానూ మాట్లాడలేదు. వీరంతా ప్రభుత్వానికే అనుకూలంగా ఓటు వేస్తారని భావిస్తోంది. అలాగే ఒకరిద్దరు ఇండిపెండెంట్ సభ్యులు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసే అవకాశం లేకపోలేదని అంచనా వేస్తోంది.
12మంది డుమ్మా..చంద్రబాబులో టెన్షన్:
మరోవైపు ఆదివారం నిర్వహించిన టీడీఎల్పీ సమావేశానికి 12 మంది ఎమ్మెల్సీలు డుమ్మా కొట్టారు. వీరిలో ఇద్దరు వ్యక్తిగత కారణాలతో రాలేకపోతున్నట్టు సమాచారం అందించారు. మిగిలిన 10 మంది మాత్రం ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.. తామంతా టీడీపీ నిర్ణయానికే కట్టుబడి ఉన్నామన్న సందేశమూ ఇవ్వలేదు. పైగా వారు ఉత్తరాంధ్ర, రాయలసీమకు చెందిన సభ్యులు. దీంతో టీడీపీలో టెన్షన్ మొదలైంది. ముందు జాగ్రత్తగా సమావేశాలకు తప్పకుండా హాజరు కావాలని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని విప్ జారీ చేశారు. వీరిలో ఎంతమంది విప్ తీసుకున్నారో స్పష్టత లేదు. దీంతో ఇవాళ్టి మండలి సమావేశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
* ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న మండలి
* పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను ప్రవేశపెట్టనున్న సర్కార్
* మండలిలో తక్కువగా ఉన్న అధికార పక్షం బలం
* టీడీపీకి 32 మంది సభ్యుల బలం
* మండలి సమావేశాలపై సర్వత్రా ఉత్కంఠ