సోమవారం రెండు కీలక సమావేశాలు
చంద్రబాబు సర్కారు సంక్షేమ పథకాలపై స్పీడ్ పెంచుతోంది.

చంద్రబాబు సర్కారు సంక్షేమ పథకాలపై స్పీడ్ పెంచుతోంది.
అమరావతి : చంద్రబాబు సర్కారు సంక్షేమ పథకాలపై స్పీడ్ పెంచుతోంది. అందులో భాగంగా సోమవారం రెండు కీలక సమావేశాలు నిర్వహించనుంది. ఉదయం టిడిపి సమన్వయ కమిటీ సమావేశం.. సాయంత్రం సచివాలయంలో కేబినెట్ భేటి జరుగనున్నాయి. కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
డ్వాక్రా గ్రూపులకు పది వేల రూపాయిల ఆర్థిక సాయం, రైతుల పెట్టుబడి సాయానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నన్నారు. ఇప్పటికే దీనిపై వ్యవసాయ, ఆర్థిక శాఖల కసరత్తు చేస్తున్నాయి. అటు.. కోల్‌కతా ర్యాలీ విజయవంతం కావడంతో జోష్‌లో ఉన్న చంద్రబాబు.. మరిన్ని సభలకు ప్రణాళికలు వేస్తున్నారు. తర్వాతి సభ ఏపీలోనా..? కర్నాటకలోనా..? అనేదానిపై కోల్‌కతాలో చర్చలు జరిపారు. మరోవైపు.. పార్టీ పటిష్టతపై సమీక్షలతో వైసీపీ అధినేత జగన్ బిజీగా ఉన్నారు. కమిటీల ఏర్పాటుకు జనసేన అధినేత కసరత్తు చేస్తున్నారు.