కేసీఆర్ నమ్మించి మోసం చేశారు : మాజీ ఎంపీ వివేక్
కరీంనగర్ : బానిసత్వం నుంచి విముక్తి లభించింది అని మాజీ ఎంపీ వివేక్ అన్నారు. పెద్దపెల్లి లోక్ సభ టికెట్ ఇవ్వనందుకు నిరసనగా ప్రభుత్వ సలహాదారు పదవికి వివేక్ రాజీనామా

కరీంనగర్ : బానిసత్వం నుంచి విముక్తి లభించింది అని మాజీ ఎంపీ వివేక్ అన్నారు. పెద్దపెల్లి లోక్ సభ టికెట్ ఇవ్వనందుకు నిరసనగా ప్రభుత్వ సలహాదారు పదవికి వివేక్ రాజీనామా
కరీంనగర్ : బానిసత్వం నుంచి విముక్తి లభించిందని మాజీ ఎంపీ వివేక్ అన్నారు. పెద్దపెల్లి లోక్ సభ టికెట్ ఇవ్వనందుకు నిరసనగా ప్రభుత్వ సలహాదారు పదవికి వివేక్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయన తొలిసారి గోదావరిఖనిలో మీడియాతో మాట్లాడారు. పెద్దపల్లి లోక్ సభ నియోజకవర్గం టీఆర్ఎస్ టికెట్ తనకు ఎందుకివ్వలేదో అర్థం కాలేదన్నారు. నమ్మించి గొంతు కోస్తారని అనుకోలేదని వివేకా ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ అభ్యర్థుల జాబితాలో నా పేరు లేకపోవడం బాధాకరం అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశానని చెప్పారు. ఎమ్మెల్యేలకు ఓటింగ్ శాతం తక్కువ రావడానికి నేనే కారణం అని నింద మోపారని వివేక్ వాపోయారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు గెలవకుండా ఇతర పార్టీ నేతలకు డబ్బులు ఇచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని కేసీఆర్, కేటీఆర్ కు ముందే చెప్పానని వివేక్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై టీఆర్ఎస్ అభ్యర్థుల ఓటమికి తాను సహకరించినట్టు వచ్చిన ఆరోపణలను వివేక్ ఖండించారు. ఇతర పార్టీల నుంచి తనకు ఆహ్వానం ఉందన్న వివేక్.. అనుచరులతో చర్చించి పార్టీ మారేది లేనిది త్వరలోనే ప్రకటిస్తానని వెల్లడించారు.
టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా పెద్దపల్లి ప్రజలతోనే ఉంటానని వివేక్ స్పష్టం చేశారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించాను అని గుర్తు చేశారు. అధికార పార్టీలో ఉండి కాంగ్రెస్ హైకమాండ్ ను ఎదిరించానని చెప్పారు. అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి.. నా పై ఐటీ దాడులు చేయించినా భయపడలేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో కాకా పాత్ర ఎవరూ కాదనలేరని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బు పంచినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని వివేక్ తెలిపారు. పెద్దపల్లికి వెంకటస్వామి పేరు పెడతామని చెప్పిన కేసీఆర్ మాట తప్పారని వివేక్ అన్నారు.
టీఆర్ఎస్ ప్రకటించిన లోక్ సభ అభ్యర్థుల జాబితాలో వివేక్ కు సీఎం కేసీఆర్ షాక్ ఇచ్చారు. వివేక్ కు పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇస్తారని అంతా అనుకున్నారు. వివేక్ కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. కేసీఆర్ మాత్రం వివేక్ కు టికెట్ ఇవ్వలేదు. ఆయన స్థానంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చిన వెంకటేశ్ నేతకానికి పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇచ్చారు.