చంద్రబాబుకి వార్నింగ్ : జగన్ కళ్లు తెరిస్తే ప్రతిపక్ష హోదా కూడా ఉండదు

ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ టీడీపీ చీఫ్ చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. చంద్రబాబుకి వార్నింగ్ ఇచ్చారు. పోలీసులను దూషించడం సరికాదని హితవు పలికారు. సెక్యూరిటీ లేకుండా

  • Published By: veegamteam ,Published On : October 12, 2019 / 01:53 PM IST
చంద్రబాబుకి వార్నింగ్ : జగన్ కళ్లు తెరిస్తే ప్రతిపక్ష హోదా కూడా ఉండదు

Updated On : October 12, 2019 / 1:53 PM IST

ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ టీడీపీ చీఫ్ చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. చంద్రబాబుకి వార్నింగ్ ఇచ్చారు. పోలీసులను దూషించడం సరికాదని హితవు పలికారు. సెక్యూరిటీ లేకుండా

ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ టీడీపీ చీఫ్ చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. చంద్రబాబుకి వార్నింగ్ ఇచ్చారు. పోలీసులను దూషించడం సరికాదని హితవు పలికారు. సెక్యూరిటీ లేకుండా చంద్రబాబు బయటికి వెళ్లగలరా అని ప్రశ్నించారు. చంద్రబాబు భాష, వ్యవహారశైలి దారుణంగా ఉందన్నారు. సీఎం జగన్ కళ్లు తెరిస్తే చంద్రబాబుకి ప్రతిపక్ష హోదా కూడా ఉండదని హెచ్చరించారు. అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను పట్టించుకోని చంద్రబాబు.. అధికారం కోల్పోయాక కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. లక్ష ఉద్యోగాలు కల్పించడం రౌడీ రాజ్యమా అని అవంతి శ్రీనివాస్‌ నిలదీశారు.

40 ఏళ్ల రాజకీయ అనుభవం, 3 సార్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి దిగజారి మాట్లాడుతున్నారని అవంతి అన్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన భూకబ్జాలు, దారుణాలను విశాఖ ప్రజలు మరిచిపోలేదన్నారు. టీడీపీ హయాంలో విశాఖలో జరిగిన అవినీతిపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు జగన్ అవకాశం ఇవ్వకపోవడంతో చంద్రబాబు పక్కన కూర్చున్నారని అవంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ జగన్ గేట్లు ఎత్తితే బాబు పక్కన కూర్చున్న నేతలు కూడా ఆయనతో ఉండరని చెప్పారు.

విశాఖ పర్యటనలో తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించిన చంద్రబాబు.. పోలీసులు ఓవర్ చేస్తున్నారని మండిపడిన సంగతి తెలిసిందే. పోలీసుల గురించి చంద్రబాబు చేసిన కామెంట్స్ ను మంత్రి అవంతి ఖండించారు. చంద్రబాబుకి మతిమరుపు ఎక్కువైందన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత జగన్‌ను విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్న విషయాన్ని అవంతి గుర్తుచేశారు. అప్పుడు పోలీసులతో జగన్‌ను అడ్డుకున్న చంద్రబాబు.. ఇప్పుడు పోలీసులపై విమర్శలు చేయడం నవ్వు తెప్పిస్తోందన్నారు.