గెలిచేది ఎవరో : కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలు

కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 2020, జనవరి 24వ తేదీ శుక్రవారం ఉదయం నుంచి పోలింగ్ ప్రక్రియను ఎన్నికల అధికారులు చేపట్టారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఎన్నికలు సజావుగా సాగేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 60 డివిజన్లు ఉడగా.. వీటిలో రెండు చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలుపొందారు.
మిగిలిన 58 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. మొత్తం 369 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 337 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 82 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎంపీ బండి సంజయ్ బైక్‌పై వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల ప్రధాన ఆయుధం ఓటు అని ఆయన అన్నారు. ప్రజలు వాస్తవాలను గ్రహించి సరైన నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు.
* 20వ డివిజన్‌లో తుల రాజేశ్వరి, 37వ డివిజన్‌లో చల్ల స్వరూపారాణి ఏకగ్రీవంగా ఎన్నిక.
* 348 పోలింగ్ కేంద్రాలు.
* మొత్తం 371 మంది అభ్యర్థులు
* కార్పొరేషన్ పరిధిలో 2, 72, 195 మంది ఓటర్లు.
* ప్రతి పోలింగ్ కేంద్రంలో ప్రిసైడింగ్ ఆఫీసర్.
* ఎన్నికల విధుల్లో 2 వేల మంది సిబ్బంది.
* కరీంనగర్ కార్పొరేషన్ కౌంటింగ్ ప్రక్రియ జనవరి 27న.
Read More : కత్రీనా కైఫ్ వివాహం..తల్లిదండ్రులుగా బిగ్ బీ, జయా బచ్చన్