జగన్ పై మత కుట్ర జరుగుతోంది…తిరుమల టికెట్ల వెనుక ఎన్టీఆర్ స్కీమ్ ట్విస్ట్

  • Published By: chvmurthy ,Published On : August 23, 2019 / 10:27 AM IST
జగన్ పై మత కుట్ర జరుగుతోంది…తిరుమల టికెట్ల వెనుక ఎన్టీఆర్ స్కీమ్ ట్విస్ట్

Updated On : August 23, 2019 / 10:27 AM IST

విజయవాడ : ఎద్దు ఈనింది అంటే దూడను కట్టేయమన్నట్టు ఏపీ బీజేపీ నాయకులు వ్యవహారిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. తిరుమలలో ఆర్టీసీ బస్సు టికెట్లపై అన్యమత ప్రచారం ప్రింటింగ్ చంద్రబాబు హయాంలోనే జరిగిందని ఆయన ఆధారాలతో సహా మీడియాకు విజయవాడలో చూపించారు. శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయమ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ట్రాప్ లో పడి బీజేపీ నాయకులు సీఎం జగన్ పై ఆరోపణలు చేస్తున్నారన్నారు.

జగన్ గారిని హిందూ వ్యతిరేకి గాముద్ర వేయాలని చూస్తున్నారని, ఆయనపై బురద జల్లాలనుకుంటే అది మీ మీదే పడుతుందని మల్లాది విష్ణు చెప్పారు. బూట్లతో దేవుడుకి దండం పెట్టిన సంస్కృతి చంద్రబాబుది అని విష్ణు తెలిపారు. జగన్ మోహన్ రెడ్డిగారిమీద, ప్రభుత్వం పై దుష్ప్రచారం చేస్తున్న ఎల్లోమీడియాపైనా, సోషల్ మీడియా లో దుష్ప్రచారం చేస్తున్న వారిపైనా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని విష్ణు హెచ్చరించారు.

రాష్ట్రంలో దేవాలయాల అభివృధ్ది, హిందూధర్మానికి మంచి జరగింది అంటే అది రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలోనే జరిగిందని చెప్పారు. ఆలయాల్లో ధూప దీప నైవైద్యాలుల టీడీపీ ప్రభుత్వ హయాంలో సదావర్తి భూములు కుంభకోణం జరిగిందని విష్ణు తెలిపారు.