Yadadri Lakshmi Narasimha Swamy : చివరి ఆదివారం కావడంతో యాదాద్రికి పోటెత్తిన భక్తులు

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కార్తీకమాసంలో చివరి ఆదివారం కావడంతో యాదాద్రికి క్యూ కట్టారు ప్రజలు.

Yadadri Lakshmi Narasimha Swamy : చివరి ఆదివారం కావడంతో యాదాద్రికి పోటెత్తిన భక్తులు

Yadadri Lakshmi Narasimha Swamy

Updated On : November 28, 2021 / 1:12 PM IST

Yadadri Lakshmi Narasimha Swamy : తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కార్తీకమాసంలో చివరి ఆదివారం కావడంతో యాదాద్రికి క్యూ కట్టారు ప్రజలు. దీంతో యాదాద్రి పరిసరప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఉచిత దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుంది.

చదవండి : Yadadri : విమాన గోపురానికి మంత్రి మల్లారెడ్డి విరాళాల సేకరణ, 11 కిలోల బంగారం

వీఐపీ టికెట్ దర్శనానికి రెండు గంటల సమయం పడుతున్నది. ఇక స్వామివారి నిత్యపూజలు తెల్లవారుజామున 4 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. స్వామి అమ్మవార్లను పట్టు వస్త్రాలు, రకరకాల పూలతో అలంకరించి అభిషేఖం చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అంతరాయం లేకుండా దర్శనం సాఫీగా జరుగుతుంది.

చదవండి : Yadadri Temple : యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. దర్శనానికి రెండు గంటల సమయం