టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

దక్షిణాఫ్రికాతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఇవాళ(22 సెప్టెంబర్ 2019) జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. భారత తుది జట్టులో ఎలాంటి మార్పులు లేవు. మొహాలి టీ20లో ఆడిన జట్టే ఈ మ్యాచ్ లో కూడా ఆడుతుంది.
మూడు టీ20ల ఈ సిరీస్‌లో ఇప్పటికే రెండు టీ20లు ముగియగా.. తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఈరోజు మ్యాచ్‌లో గెలవడం ద్వారా సిరీస్‌ని 2-0 కైవసం చేసుకోవాలని భారత్ భావిస్తుంది. ఆఖరి టీ20లో గెలిచి పరువు నిలుపుకోవాలని సౌతాఫ్రికా అనుకుంటుంది.
టీ20 రికార్డుల పరంగా చూసుకుంటే సఫారీలపై టీమిండియాదే ఆధిపత్యంగా ఉంది. ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు 14 సార్లు తలపడగా.. 9 మ్యాచ్‌ల్లో భారత్ విజయం దక్కించుకుంది. టీ20 సిరీస్ ముగిసిన తర్వాత అక్టోబరు 2వ తేదీ నుంచి మూడు టెస్టుల సిరీస్ జరగనుంది.
జట్లు:
భారత్: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య , కృనాల్ పాండ్య, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, నవదీప్ షైనీ
దక్షిణాఫ్రికా: డికాక్ (కెప్టెన్), నొర్జీ, డసెన్, బవుమా, మిల్లర్, ఫెలుక్వాయో, ప్రిటోరియస్, జోర్న్ ఫార్చూన్, రబాడ, జూనియర్ డాలా, షంసీ.
Toss news – #TeamIndia win the toss and elect to bat first. Team unchanged from the previous T20I #INDvSA @Paytm pic.twitter.com/pHcdFrttnP
— BCCI (@BCCI) September 22, 2019